Planets Conjunction: ఒకే రాశిలో మూడు గ్రహాల కూటమి.. ఈ రాశుల లైఫ్ డేంజర్ లో పడినట్లే..

Published : Apr 24, 2026, 04:44 PM IST

Planets Conjunction: మే నెలలో గ్రహాల కూటమి ఏర్పడనుంది. మేష రాశిలో కుజుడు, సూర్యుడు, బుధుడి కలయిక ఏర్పడనుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అనుకోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. 

PREV
15
గ్రహాల కూటమి..

జోతిష్య శాస్త్రంలో గ్రహాలు తరచూ మారుతూనే ఉంటాయి. మే11 వ తేదీన మేష రాశిలోకి కుజుడు అడుగుపెట్టనున్నాడు. ఆల్రెడీ ఈ రాశిలో సూర్యుడు, బుధుడు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ మూడు గ్రహాలు కలిసి త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది. సూర్యుడు, కుజుడు రెండూ అగ్నితత్వం ఉన్న గ్రహాలు కావడంతో.. కొన్ని రాశుల వారికి ఈ కలయిక సమస్యలు తెచ్చి పెట్టే అవకాశం ఉంది. మరి, ఏ రాశుల వారు మే నెలలో ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారో ఇప్పుడు తెలుసుకుందాం..

25
వృషభ రాశి...

వృషభ రాశివారు మే నెలలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. ఈ మూడు గ్రహాల కలయిక ఈ రాశుల వారి పన్నెండో స్థానంలో జరుగుతుంది. కాబట్టి, ఈ సమయంలో మీరు వేసే ప్రతి అడుగులోనూ జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఆఫీసులో సహోద్యోగుల నుంచి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పనిపై ఎక్కువ ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం. మీరు చేసే చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యలను తెచ్చి పెడుతుంది. ఈ సమయంలో ఈ రాశివారు తేనెను తీసుకోవడం వల్ల కుజుడి ప్రభావం తగ్గుతుంది. సమస్యలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.

35
తుల రాశి...

తుల రాశివారికి, సూర్యుడు- కుజుడు కలయిక ఏడో స్థానంలో జరుగుతుంది. దీని వల్ల ఈ రాశివారు కాస్త దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ సమయంలో అనేక సవాళ్లు మీకు ఎదురయ్యే ప్రమాదం ఉంది. వైవాహిక జీవితంలో అభిప్రాయ బేధాలు, ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు రావచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో ఆందోళనలు రావచ్చు. ప్రతిరోజూ సూర్యుడిని పూజించడం ఉత్తమం..

45
మకర రాశి...

మకర రాశి వారికి మే 11 తర్వాత కొన్ని సమస్యలు రావచ్చు.ఈ రాశి నాలుగో స్థానంలో సూర్య- కుజ సంయోగం ఏర్పడటం వల్ల భౌతిక సుఖాలు పెరుగుతాయి. అయితే, ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. తల్లి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ కాలంలో ఆస్తిని లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. హనుమాన్ చాలీసా పఠించాలి.

55
మీన రాశి...

మీన రాశివారికి, రెండో స్థానంలో సూర్య-కుజ సంయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కుటుంబంలో కొన్ని ఆటంకాలు ఎదురౌతాయి. శని, కుజుల మధ్య ఏర్పడే యోగం కారణంగా ఈ రాశివారికి ఇతరులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎవరితో మాట్లాడినా మాటలు అదుపులో పెట్టుకోవాలి. డబ్బు విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. ఒకటికి పదిసార్లు ఆలోచించడం మంచిది. లేకపోతే నష్టపోతారు. ఈ రాశివారు మంగళవారం బెల్లం, గోధుమలు పేదలకు దానం చేస్తే.. కుజుడి నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories