
జోతిష్యశాస్త్రం మన జీవితాలను చాలా బాగా ప్రభావితం చేస్తుంది. అది మంచైనా కావచ్చు. చెడు అయినా కావచ్చు. మీరు జోతిష్యం నమ్మితే.. కొన్ని రంగులకు దూరంగా ఉండాలి. అయితే.. ఏ రాశివారు ఏ రంగులకు దూరంగా ఉంటే వారికి మంచి జరుగుతుంతో తెలుసుకుందాం...
1.మేష రాశి..
మేష రాశివారు నలుపు రంగుకు దూరంగా ఉండటమే మంచిది. మేష రాశి చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. చాలా ఎక్కువ శక్తితో ఉంటుంది. అలాంటి మేష రాశివారు నలుపు రంగు ధరించడం వల్ల..వారిలో ఉన్న శక్తి తగ్గే అవకాశం ఉంది. నెగిటివిటీ పెరిగే అవకాశం ఉంది.
2.వృషభ రాశి..
వృషభ రాశివారికి ఎరుపు రంగు పెద్దగా అచ్చురాదు. ఎందుకంటే వృషభ రాశివారు ఎక్కువగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఈ రాశి భూమికి సంకేతం. ఎరుపు రంగు వారి నేచర్ కి విరుద్దం. వారిని ప్రశాంతంగా ఉండనివ్వదు.
3.మిథున రాశి..
మిథున రాశివారికి డార్క్ బ్లూ పెద్దగా కలిసి రాదు. ఈ రాశివారు ఆ రంగుకి దూరంగా ఉండాలి. మిధున రాశి వారు ప్రశాంతంగా ఉండే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ముదురు నీలం, వారి డైనమిక్ వ్యక్తిత్వానికి చాలా తీవ్రమైన లేదా నిర్బంధంగా అనిపించవచ్చు.
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు ఆరెంజ్ కలర్ కి వీలైనంత దూరంగా ఉండటమే బెటర్.. ఈ రాశివారు దాదాపు ఇతరులను సంరక్షించడంలో, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఉంటారు. కానీ.... ఆరెంజ్ కలర్.. వారి వ్యక్తిత్వాన్ని ఇబ్బందిపెట్టే లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకే.. ఈ రంగు దుస్తులు ధరించకపోవడమే మంచిది.
5.సింహ రాశి..
సింహ రాశివారు గ్రే కలర్ కి దూరంగా ఉండటం చాలా అవసరం. సింహ రాశివారు ఎక్కడున్నా తమకు గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. మంచిగా షైన్ అవ్వాలని అనుకుంటారు. కానీ.. ఈ గ్రే కలర్ చాలా డల్ గా ఉంటుంది. వారి పర్సనాలిటీ ని దెబ్బతీస్తుంది. కాబట్టి.. ఈ రంగుకి దూరంగా ఉండటం మంచిది.
6.కన్య రాశి..
కన్య రాశివారు నియాన్ కలర్స్ కి దూరంగా ఉండటమే మంచిది. కన్య రాశివారు దాదాపు సింపుల్ గా ఉండటాన్ని ఇష్టపడతారు. కానీ.. ఈ నియాన్ కలర్స్ అలా కాదు. వారి వ్యక్తిత్వానికి భిన్నంగా ఉంటాయి.
7.తుల రాశి..
తుల రాశివారు డార్క్ గ్రీన్ కలర్ పెద్దగా కలిసి రాదు. ఆ రంగు దుస్తులు కూడా ధరించకపోవడమే మంచిది. తుల రాశివారు జీవితంలో ప్రతిదాంట్లోనే బ్యాలెన్స్డ్ గా ఉండాలని అనుకుంటారు. కానీ.. ఈ డార్క్ గ్రీన్ కలర్ అందుకు భిన్నంగా ఉంటుంది. ఇమ్ బ్యాలెన్స్, జెలసీ, గొడవలకు ఈ రంగు దగ్గరగా ఉంటుంది. కాబట్టి.. ఈ రాశివారు ఆ రంగు దుస్తులు కూడా ధరించకపోవడమే మంచిది.
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు.. పేస్టల్ కలర్స్ కి దూరంగా ఉండటం మంచిది. ఈ రాశివారు చాలా పాశినేటివ్ గా ఉంటారు. కానీ.. ఈ రంగులు.. సాఫ్ట్ గా,.. చాలా ల్యాక్ గా ఉంటాయి. రెండింటికీ సరిపోలదు.
9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు బ్రౌన్ కలర్ కి దూరంగా ఉండాలి. ఈ రాశివారు చాలా సాహసోపేతంగా, ఆప్టిమిస్టిక్ గా ఉంటారు. ఈ బ్రౌన్ కలర్ వ్యక్తిత్వం అందుకు భిన్నంగా ఉంటుంది. కాబట్టి.. ఈ రాశివారికి పెద్దగా సెట్ అవ్వదు.
10.మకర రాశి..
మకర రాశివారు బ్రైట్ ఎల్లో కలర్ కి దూరంగా ఉండాలి. మకర రాశివారు ఎక్కువగా సీరియస్ గా, క్రమశిక్షణతో ఉంటారు. కానీ ఎల్లో కలర్ ఫోకస్ తక్కువగా, డిస్ట్రాక్టింగ్ గా ఉంటుంది. అందుకే.. ఈ రాశివారు ఆ రంగును ఎంచుకోకపోవడమే మంచిది.
11.కుంభ రాశి..
కుంభ రాశివారు బీజ్ కలర్స్ కి దూరంగా ఉండాలి. కుంభ రాశివారు చాలా ఇన్నోవేటివ్ గా ఉంటారు. ముందు చూపుతో ఉంటారు. కానీ.. ఈ రంగులు మాత్రం.. డల్ గా.. అన్నింటినీ వెనక్కి లాగేలా ఉంటాయి. అందుకే ఈ రంగులకు దూరంగా ఉండటం మంచిది.
12.మీన రాశి..
మీన రాశివారు నియాన్ గ్రీన్ కలర్ కి దూరంగా ఉండటం మంచిది. మీన రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. ఊహా లోకంలో విహరిస్తూ ఉంటారు. అలాంటి ఈ రాశివారికి నియాన్ గ్రీన్ కలర్ సూట్ అవ్వదు. ఈ రంగు చాలా హార్ష్ గా ఉంటుంది. కాబట్టి.. ఇలాంటి రంగులకు వారు దూరంగా ఉండటమే మంచిది.