ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి ఒకే రాశిలో ఎక్కువ గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి. అలా అనుకోకుండా.. ఒకే రాశిలో రెండు, మూడు గ్రహాలు అరుదుగా కలిసినప్పుడు యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ యోగ ప్రభావం కొన్ని రాశుల జీవితాలపై పడుతుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఆగస్టులో బుధుడు, సూర్యుడు రెండు గ్రహాలు.. సింహ రాశిలోకి ప్రవేశించనున్నాయి. శుక్రుడు, చంద్రుడు ఆల్రెడీ సింహ రాశిలోనే ఉన్నాయి. ఈ అరుదైన కలయిక కారణంగా చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా.. కొన్ని రాశులవారికి అదృష్టం జలగ పట్టినట్లు పడుతుందట. మరి.. ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం...