వృషభ రాశివారికి శుక్రుడి సంచారం చాలా అనుకూల ఫలితాలనిస్తుంది. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. కెరీర్, వ్యాపారంలో కొత్త పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అప్పుల బాధలు తగ్గి, రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రమోషన్, జీతం పెంపు వంటి మంచి మార్పులు కనిపిస్తాయి.