Wealth Mantras: పేదరికాన్ని తొలగించే శక్తివంతమైన మంత్రాలు ఇవిగో, వీటిని ఎప్పుడు జపించాలంటే

Published : Apr 19, 2026, 07:52 AM IST

Wealth Mantras: పేదరికంతో ఇబ్బంది పడుతున్నవారు, సరైన సమయానికి డబ్బులు చేతికి అందక వేదనకు గురవుతున్నవారు కొన్ని మంత్రాలను జపిస్తే ఆర్ధిక సమస్యలు తీరుతాయి. మహాలక్ష్మి, శుక్ర, కుబేరుల శక్తివంతమైన మంత్రాలు జపించాలి. అవేంటో తెలుసుకోండి.

PREV
14
ధనవంతులవ్వాలంటే ఏం చేయాలి?

లక్ష్మీదేవి కటాక్షం జీవితంలో ఉంటే చాలు… ఆ వ్యక్తి ధనవంతుడు అవుతాడు.  జీవితంలో సకల సంతోషాలు దక్కుతాయి. పేదిరికం పోతుంది. దీని కోసం కష్టపడి పనిచేయడంతో పాటు దైవానుగ్రహం కూడా అవసరం. దైవానుగ్రమం కావాలంటే వారిని ప్రసన్నం చేసుకునేందుకు సరైన మంత్రాలు జపించాలి. మంత్రాలకు విశ్వంలోని శక్తిని ఆకర్షించే పవర్ ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు, మహాలక్ష్మి, కుబేరుడి అనుగ్రహం ఉంటే పేదరికాన్ని పొగొట్టుకోవచ్చు. వీరిని ప్రసన్నం చేసుకునేందుకు ఎలాంటి మంత్రాలు జపించాలో తెలుసుకోండి.

24
లక్ష్మీదేవి మంత్రం

సంపద పెరగాలంటే మహాలక్ష్మి దేవిని పూజించాలి. పూర్వం దేవేంద్రుడు మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ మంత్రాన్ని జపించాడని అంటారు. “నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే | శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే”. ప్రతిరోజూ ఉదయం ఈ మంత్రాన్ని పఠిస్తే, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. దీన్ని శ్రీ సూక్తం అంటారు. వేదాలలో చెప్పిన ఈ శ్రీ సూక్తం చాలా శక్తివంతమైనది. ఇది జాతకంలో ఉన్న దరిద్ర యోగాన్ని కూడా తొలగించగలదు. శుక్రవారం ఉదయాన్నే స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి, మహాలక్ష్మి పటం ముందు నెయ్యి దీపం వెలిగించాలి. ఆ తరువాత  ఈ శ్రీ సూక్తాన్ని పఠించడం లేదా వినడం వల్ల పేదరికం పోతుంది.

34
కోటీశ్వరులను చేసే శుక్ర భగవానుడు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి కోటీశ్వర యోగాన్ని ఇచ్చేది శుక్రుడే. ఎందుకంటే విలాసవంతమైన జీవితం, వాహనాలు, ఆస్తులు కొనాలంటే శుక్రుడి అనుగ్రహం ఉండాలి.  “ఓం అశ్వధ్వజాయ విద్మహే ధనుర్ హస్తాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్”. ఈ మంత్రాన్ని శుక్రవారం 108 సార్లు జపిస్తే, జాతకంలో శుక్రుడు బలపడి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

మహాలక్ష్మి సంపదకు అధిదేవత అయితే, కుబేరుడు ఆ సంపదను కాపాడేవాడు. "ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యధిపతయే ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహా". ఉత్తర దిక్కుకు తిరిగి కూర్చుని ఈ మంత్రాన్ని పఠిస్తే, వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి.

44
ఎలా జపించాలి?

సంపదను ఇచ్చే ఈ మంత్రాలను పఠించడానికి కొన్ని పద్ధతులున్నాయి. అప్పుడే వాటి ఫలితం రెట్టింపు అవుతుంది. బ్రహ్మ ముహూర్తంలో అంటే ఉదయం 4:30 నుంచి 6:00 గంటల మధ్య సమయం చాలా ఉత్తమమైనది. ఈ సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది. శరీరం, మనస్సు రెండూ శుభ్రంగా ఉండాలి. శుభ్రమైన ప్రదేశంలో తూర్పు లేదా ఉత్తరం వైపు తిరిగి జపించాలి.  ఏ మంత్రాన్నైనా కనీసం 108 సార్లు పఠించడం వల్ల దాని శక్తి మీ శరీరంలో ఇంట్లో నిలిచిపోతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories