Baba Vanga: ఈ ఏడాది చివరి వరకు ఈ 4 రాశుల వారికి కష్ట నష్టాలు తప్పకపోవచ్చు, బాబా వంగా జోస్యం

Published : Apr 19, 2026, 06:06 AM IST

Baba Vanga: బాబా వంగా ముందే చెప్పిన జోస్యం ప్రకారం రాశి చక్రంలోని 12 రాశులలో  4 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు వీరికి కష్టాలు, నష్టాలు కలిగే అవకాశం ఉంది.  ఆ నాలుగు రాశులు ఏవో ఇక్కడ చూడండి.

PREV
14
మేష రాశి

బాబా వంగా చెప్పిన ప్రకారం మేష రాశి వారు 2026 ఏడాది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి చంచల స్వభావం. ఒక పనిపై ఏకాగ్రత చూపించలేరు.  ఈ చంచల స్వభావాన్ని అదుపులో పెట్టుకోకపోతే చాలా కష్టం.  ఇతరులతో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటేనే ఈ ఏడాది కాస్త ప్రశాంతంగా ముందుకు సాగేది. 

24
కన్యా రాశి

కన్యా రాశి వారు ప్రతి దాని గురించి  ఎక్కువగా ఆలోచిస్తారు. దాన్ని మానుకోవడమే మంచిది. లేదంటే ఇబ్బందుల్లో పడతారు. ఇతరుల గురించి మాట్లాడడం, చెడుగా ప్రచారం చేయడం, వారిని విమర్శించడం వంటివి చేస్తే గొడవలు రావచ్చు. ఈ ఏడాది ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం తగ్గవచ్చు. పొట్ట సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది.

34
ధను రాశి

ధనుస్సు రాశి వారికి 2026 చాలా ఉత్సాహంగా సాగుతుంది. కానీ కొన్ని తప్పులు నిర్ణయాల కారణంగా మాత్రం కష్టాలు కొని తెచ్చుకుంటారు.దీనివల్ల వీరే కాదు… వీరి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడాల్సి రావచ్చు. అంతేకాకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఒత్తిడికి గురవుతారు. కాబట్టి నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించండి. ఓసారి కుటుంబసభ్యులతో చర్చించండి. సొంత నిర్ణయాలు త్వరగా తీసేసుకోకండి.

44
కుంభ రాశి

కుంభ రాశి వారు ఈ ఏడాదంతా జాగ్రత్తగా ఉండాలి. ఏ పనిలో అయినా అజాగ్రత్తగా చేస్తే నష్టపోయే అవకాశం ఉంది. ఈ రాశి వారి మనసు నిలకడగా ఉండదు. అలాగే అనుబంధాల విషయంలో స్పష్టంగా ఉండండి. ఎవరికీ తప్పుడు వాగ్దానాలు చేయకండి. ఈ ఏడాది మీరు గతంలో చేసిన తప్పుల ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories