Chandra Grahan: మొదటి చంద్ర గ్రహణం.. ఈ రాశులకు కష్టాలు తప్పవు, ఈ చిన్న పరిహారం చేస్తే చాలు

Published : Mar 02, 2026, 11:05 AM IST

Chandra Grahan: ఈ ఏడాది మొదటి చంద్ర గ్రహణం మార్చి 3వ తేదీన ఏర్పడనుంది. ఈ గ్రహణ ప్రభావం భారత దేశంలోనూ ఉండనుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి కష్టాలు ఎదురుకానున్నాయి. 

PREV
13
మొదటి చంద్ర గ్రహణం..

Chandra Grahan:ఈ ఏడాది చంద్రగ్రహణం భారత ప్రామాణిక సమయం ప్రకారం, మార్చి 3, 2026 మధ్యాహ్నం సమయంలో సింహ రాశిలో సంభవిస్తుంది. ఇది పూర్వ ఫాల్గుణి నక్షత్రంలో కూడా సంభవిస్తుంది. ఈ గ్రహణం భారత దేశంలో క్లియర్ గా కనిపిస్తుంది. ఈ గ్రహణ ప్రభావం జోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులపై చాలా ఎక్కువగా చూపించనుంది. మరి.. ఈ చంద్ర గ్రహణంతో అదృష్టాన్ని పెంచుకునే రాశులు ఏంటి? కష్టాలు ఎదుర్కోవలసిన రాశులు ఏంటి అనేది కూడా చూద్దాం...

23
ఈ రాశులకు సమస్యలు తప్పవు...

ఈ చంద్ర గ్రహణం సింహ రాశిలో సంభవిస్తుంది. కాబట్టి, ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారికి ఎటు నుంచి సమస్యలు ఎలా వస్తాయో కూడా ఊహించలేరు. చాలా ఒత్తిడిగా ఉంటుంది. గ్రహణం రోజున ఈ రాశివారు వీలైనంత వరకు కోపాన్ని నియంత్రించుకోవాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ జీవితంలో కూడా సమస్యలు రావచ్చు.

సింహ రాశితో పాటు మేషం, కర్కాటక, మకర, మీన రాశిలో జన్మించిన వారు కూడా చంద్ర గ్రహణం రోజున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చంద్ర గ్రహణ ప్రతికూల ప్రభావం ఈ రాశులపై చాలా ఎక్కువగా ఉంటుంది.ఈ సమయంలో ఈ రాశివారు ఆర్థిక నష్టాలు, కీర్తిని కోల్పోయే అవకాశం ఉంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.

33
ఈ రాశులపై శుభ ఫలితాలు...

వృషభ, మిథున, తుల రాశుల వారికి చంద్ర గ్రహణం శుభ ఫలితాలను తీసుకురానుంది. ఈ సమయంలో ఈ రాశుల వారి కెరీర్ లో పురోగతి పొందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఎక్కడ పెట్టుబడి పెట్టినా.. మంచి లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం ఆనందంగా మారుతుంది. ఇక.. మిగిలిన రాశుల వారికి మిశ్రమ ఫలితాలు కలిగే అవకాశం ఉంది.

చెడు ప్రభావం తగ్గడానికి ఏం చేయాలి..?

చంద్ర గ్రహణ చెడు ప్రభావం తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు పాటిస్తే సరిపోతుంది.వీలైనంత వరకు ఈ సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలి. చంద్రుని మంత్రాలు చపించడం, దేవుడిని ప్రార్థించడం లాంటివి చేయాలి. ఏదైనా ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. గ్రహణం తర్వాత స్నానం చేసి, ఇంటి చుట్టూ గంగా జలాన్ని చల్లాలి. గ్రహణం తర్వాత దేవాలయానికి లేదా పేదలకు మీకు తోచినది దాణం చేయాలి. చంద్రుడు.. తెలుపు రంగుకు మారుపేరు కాబట్టి.. తెలుపు రంగు ఆహారాలు అంటే బియ్యం, పంచదార , పాలు, తెలుపు రంగు దుస్తులు లాంటివి దానం చేయడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories