Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ధన, వస్తు, వాహన లాభాలు.. మీ రాశి ఉందో చూడండి!

Published : Mar 02, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 02.03.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

313
వృషభ రాశి ఫలాలు

మిత్రులతో విహారయాత్రలలో పాల్గొంటారు. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. సన్నిహితులతో ఉత్సహంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

413
మిథున రాశి ఫలాలు

బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. రుణ సమస్యలు అధికమవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

513
కర్కాటక రాశి ఫలాలు

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.

613
సింహ రాశి ఫలాలు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

713
కన్య రాశి ఫలాలు

కొన్ని వ్యవహారాల్లో సమస్యలు తొలగి ఊరట కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆప్తుల వల్ల కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

813
తుల రాశి ఫలాలు

ధన, వస్తు, వాహన లాభాలు పొందుతారు. కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు. సంఘంలో పెద్దల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

దూరప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. ఇంటా బయటా ప్రతికూల వాతావరణం ఉంటుంది. రుణ ప్రయత్నాలు అనుకూలించవు. వృత్తి, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 

1113
మకర రాశి ఫలాలు

వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. స్థిరాస్తి లాభం కలుగుతుంది. దైవారాధన వల్ల శుభ ఫలితాలు వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

1213
కుంభ రాశి ఫలాలు

ముఖ్యమైన పనులలో కావాల్సిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి.

1313
మీన రాశి ఫలాలు

ఆరోగ్యం అంతగా సహకరించదు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహం కలిగిస్తాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు మందకొడిగా సాగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories