Venus Transit: మార్చిలో శుక్ర సంచారంతో ఈ 4 రాశులకు డబుల్ హ్యాపీనెస్

Published : Mar 02, 2026, 10:09 AM IST

Venus Transit:  మార్చిలో కొన్ని రాశులకు అద్భుతంగా కలిసివస్తుంది.  మార్చి 1, 2026 రాత్రి శుక్రుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు ఇలా రాశి మారడం వల్ల నాలుగు భారీ ప్రయోజనాలను అందిస్తుంది. 

PREV
15
మీన రాశిలోకి శుక్రుడు

జ్యోతిషశాస్త్రంలో శుక్రుడిని శుభ గ్రహంగా చెప్పుకుంటారు. ఒక వ్యక్తి జీవితంలో అందం, సంపద, విలాసం, డబ్బు, గౌరవం వంటివన్నీ ఇచ్చేది శుక్రుడే. మార్చి 1న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించింది. ఈ మార్పు వల్ల  4 రాశుల వారికి జీవతంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి.  అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

25
మేషం

మార్చి 1న జరిగిన శుక్ర సంచారం వల్ల మేష రాశి వారికి భారీగా ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల చేతిలో ఆగిపోయిన డబ్బు తిరిగి మీకు అందుతుంది. ఈ రాశి వారిలో ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్, జీతం పెంపు వంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారం చేస్తున్నవారికి పెద్ద ఒప్పందం కుదురవచ్చు. ఈ రాశివారు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయవచ్చు.

35
కర్కాటకం

కర్కాటక రాశి వారికి శుక్రుడి సంచారం వల్ల జీవితంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఇక పెళ్లికాని వారికి మంచి సంబంధాలు కుదరవచ్చు. వీరు ఏ పని ప్రారంభించినా అందులో విజయం సాధించే అవకాశం ఉంది. వీరికున్న ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.  ఆరోగ్యం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. వారి పిల్లలు గొప్ప విజయాన్ని సాధించవచ్చు.

45
ధనుస్సు

ధనుస్సు రాశి వారికి మార్చిలో కలిసివస్తుంది. శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి మంచి రోజులు మొదలవుతాయి. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. ఏదైనా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్, జీతం పెంపు లభిస్తాయి. ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోవచ్చు.

55
మీనం

మీన రాశిలోకే శుక్రుడు అడుగపెట్టాడు. కాబట్టి వీరి జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఈ రాశి వారు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను అందిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఆ అవకాశం దొరుకుతుంది. ఈ రాశి వారు వ్యాపారం ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయం. ఈ రాశివారి తల్లి వైపు బంధువుల నుంచి మంచి సపోర్టు లభిస్తుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలంగా మారుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories