సెప్టెంబర్ లో బుధాదిత్య రాజయోగం...మూడు రాశులకు అదృష్ట కాలం..!

Published : Aug 22, 2025, 12:05 PM IST

సెప్టెంబర్ నెలలో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం.. మూడు రాశుల జీవితాన్ని పూర్తిగా మార్చేయనుంది. వారు ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం సాధించగలరు.

PREV
14
బుధాదిత్య రాజయోగం..

వేద జోతిష్య శాస్త్రంలో, తొమ్మిది గ్రహాలు ఒక నిర్దిష్ట కాలం తర్వాత తమ రాశి చక్రాలను మార్చుకుంటూ ఉంటాయి. అదేవిధంగా, మనం గ్రహాల రాజు అయిన సూర్యుడు.. ప్రతి 30 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. మళ్లీ అదే రాశిలోకి తిరిగి రావడానికి కనీసం సంవత్సరం పడుతుంది. ఇలా ప్రతి రాశిని మారే క్రమంలో సూర్యుడు.. ఏదో ఒక గ్రహాన్ని కనెక్ట్ అవుతూ ఉంటాడు. సెప్టెంబర్ లో సూర్యుడు బుధ గ్రహంతో కలవనున్నాడు. ఈ క్రమంలోనే బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రెండూ కన్య రాశి లో కలవనున్నాయి. మరి, దీని ప్రభావం కారణంగా మూడు రాశులకు అదృష్టయోగం కలగనుంది. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దాం...

24
1.మిథున రాశి...

మిథున రాశి వారికి నాల్గవ ఇంట్లో మిథున బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ రాశివారి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఈ రాశికి చెందిన వారి వైవాహిక జీవితం చాలా సజావుగా సాగుతుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. మీకు సమాజంలో గౌరవం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు పదోన్నతి పొందే అవకాశం ఉంది. జీతం పెరిగే అవకాశం ఉంది. వీరి అదృష్టం పెరుగుతుంది. అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. ఆనందం పెరుగుతుంది. బుధుడు, సూర్యుని అనుగ్రహంతో వ్యాపారంలో లాభాలు పొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు, మీ జీవిత భాగస్వామి నమ్మకాన్ని గెలుచుకోవడంలో విజయం సాధిస్తారు. కొత్త ఇల్లు, కారు కొనే అవకాశం ఉంది.

34
2.కన్య రాశి...

కన్య రాశి వారికి బుధాదిత్య యోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బుధుడు-సూర్యుడు ఈ రాశి లగ్నంలో కలిసి ఉన్నందున, అదృష్టం మీ వైపు ఉంటుంది. మీ గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాల నుండి మీరు ప్రయోజనం పొందవచ్చు. ఉద్యోగులకు సమయం బాగుంటుంది. ఆదాయం, విశ్వాసం పెరగవచ్చు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడవచ్చు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. సమాజంలో మీ గౌరవం వేగంగా పెరుగుతుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. మీరు మీ భాగస్వామితో ఒక ట్రిప్ కి వెళ్లే అవకాశం ఉంది. దీనితో, భాగస్వామ్యంలో జరుగుతున్న వ్యాపారంలో మీరు చాలా లాభం పొందవచ్చు. దీనితో, కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. మీరు ఉన్నత అధికారిని కలవవచ్చు. ఇది మీ కెరీర్‌లో మంచి ప్రభావాన్ని చూపుతుంది.

44
3.వృశ్చిక రాశి..

బుధాదిత్య యోగం వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. ఈ రాశిచక్రంలోని పదకొండవ ఇంట్లో బుధుడు-సూర్యుడు కలయిక జరుగుతోంది. అటువంటి పరిస్థితిలో, సమాజంలో మీ గౌరవం పెరగవచ్చు. మీ పని , వ్యాపారంలో పురోగతి ఉండవచ్చు. అదృష్టం పెరగవచ్చు. మీరు ఏదైనా మతపరమైన లేదా శుభ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఉద్యోగులకు పదోన్నతి, జీతం , ప్రయాణ ప్రయోజనాలు లభిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. దీనితో పాటు, మీరు స్నేహితులతో మంచి సమయాన్ని గడిపే అవకాశం ఉంది. మంచి ట్రిప్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. జీవితంలో ఆనందం పెరుగుతుంది. దీనితో, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మికత వైపు కూడా అడుగులు వేస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories