Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టిన వారు.. చాలా నిస్వార్థపరులు, ఇతరులకు సేవ చేస్తారు. మీరు ఉన్నారేమో చూసుకోండి 

Published : Apr 20, 2025, 03:57 PM ISTUpdated : Apr 20, 2025, 05:03 PM IST

జ్యోతిష్య శాస్త్రంలో న్యూమరాలజీ ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనం పుట్టిన తేదీ ఆధారంగా మన వ్యక్తిత్వం ఎలాంటిదో అంచనా వేస్తుంటారు. భవిష్యత్తులో జీవితంలో జరిగే విశేషాలను పుట్టిన తేదీ ఆధారంగా చెబుతుంటారు. మన జన్మ తేదీ ఆధారంగా రాడిక్స్ నెంబర్ ని నిర్ణయిస్తారు. 3 రాడిక్స్ నెంబ‌ర్స్‌లో జ‌న్మించిన వారి జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
15
Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టిన వారు.. చాలా నిస్వార్థపరులు, ఇతరులకు సేవ చేస్తారు. మీరు ఉన్నారేమో చూసుకోండి 
Sucess story

రాడిక్స్ నెంబర్ అనేది న్యూమరాలజీలో వ్యక్తి జన్మ తేదీ ఆధారంగా లెక్కిస్తారు. ఇది ఒక వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం,  వారి జీవిత మార్గాన్ని సూచిస్తుంది. రాడిక్స్ 3 నెంబ‌ర్ విష‌యానికొస్తే.. ఏదైనా నెలలో 3, 12, 21, 30వ తేదీల్లో జన్మించిన వారి ఈ రాడిక్స్ నెంబ‌ర్ కిందికి వ‌స్తారు. మ‌రి ఈ తేదీల్లో జ‌న్మించిన వారు వ్య‌క్తిత్వం, భ‌విష్య‌త్తు ఎలా ఉంటుంది.? అస‌లు న్యూమ‌రాల‌జీ ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

 

25

* రాడిక్స్ నెంబ‌ర్ 3 ఉన్న వారు స్వ‌తంత్ర భావాల‌ను క‌లిగి ఉంటారు. జీవితంలో సొంత కాళ్ల‌పైనే నిల‌బ‌డాల‌నే ఆలోచ‌న‌ల‌తో ఉంటారు. ఎవ‌రిపై ఆధార‌ప‌డ‌రు. ఈ తేదీల్లో పుట్టిన వారు పెట్టుబడి, ట్రేడింగ్, స్టాక్, బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ రంగాలలో రాణించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. జీవితంలో ఉన్న‌త స్థాయికి చేరుకుంటారు. 
 

35

* ఈ తేదీల్లో జ‌న్మించిన వారు జీవితంలో ఉన్న ల‌క్ష్యాల‌ను క‌లిగి ఉంటారు. ఎంత‌టి క‌ష్టం ఎదురైనా త‌ట్టుకొని నిల‌బ‌డ‌తారు. జీవితంలో జీరో స్థాయికి ప‌డిపోయినా మ‌ళ్లీ రెట్టించిన ఉత్సాహంతో హీరో స్థాయికి ఎదిగే సామ‌ర్థ్యం వీరిలో ఉంటుంది. అజ‌యం వ‌చ్చింద‌ని కుంగిపోరు. అలాగే ఈ తేదీల్లో పుట్టిన వారు ఆర్థిక నిర్వహణ విషయాలలో చాలా కఠినంగా ఉంటారు. మీరు వ్యాపారం, బ్యాంకింగ్, ఫైనాన్స్ వాణిజ్య రంగాలలో బాగా రాణిస్తారు.
 

45

* 3, 12, 21, 30 తేదీల్లో జ‌న్మించిన వారు నిస్వార్థంగా ఉంటారు. ఏది ఆశించ‌కుండానే ఇత‌రుల‌కు సేవ చేస్తుంటారు. స్నేహితులు, కుటుంబ స‌భ్యుల‌కు త‌మ స‌ల‌హాలు ఇస్తారు. వీరు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని సాగిస్తారు. 
 

 

55

* ఈ తేదీలలో జన్మించిన వారు చిన్న చిన్న విష‌యాల‌కు సంతృప్తి చెంద‌రు. ఉన్న‌త స్థానం కోసం అహ‌ర్నిశ‌లు కృషి చేస్తారు. ఉన్న‌త స్థానంలో ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తారు. 

Read more Photos on
click me!

Recommended Stories