ఒకప్పుడు మనుషుల మంచితనం, వ్యక్తిత్వం, ప్రవర్తనను బట్టి గౌరవించేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. డబ్బు, స్థాయిని బట్టే గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి. డబ్బు సంపాదించడం అంత ఈజీ పనికాదు. కానీ సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవారు చాలా త్వరగా డబ్బు సంపాదిస్తారట. 25 నుంచి 45 సంవత్సరాల లోపే అపార సంపదను పొందుతారట. మరి ఏ తేదీల్లో పుట్టినవారికి ఈ సంపాదన కలిసివస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.
మూల సంఖ్య 5 కలిగిన వ్యక్తులు..
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 5, 14 లేదా 23 తేదీల్లో పుట్టినవారి మూల సంఖ్య 5. ఈ రాడిక్స్ సంఖ్య గల వ్యక్తులు తెలివైనవారు, ధైర్యవంతులు, కష్టజీవులు. పరిస్థితులకు అనుగుణంగా మారే ప్రత్యేక లక్షణం వీరిలో ఉంటుంది. ఇది వారి విజయానికి దోహదపడుతుంది.
బుధుడి ప్రభావం
సంఖ్యాశాస్త్రం ప్రకారం మూల సంఖ్య 5 అధిపతి బుధ గ్రహం. ఇది మాట, జ్ఞానం, తెలివితేటలకు అధిపతి. బుధుడిని వ్యాపారం, ఆర్థిక లాభం, భాగస్వామ్యం, స్నేహం మొదలైన వాటికి కారకంగా భావిస్తారు. బుధుడు ఈ అన్ని రంగాలను నియంత్రించే గ్రహం. వారి అధిపతి గ్రహ ప్రభావం వల్ల ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు వ్యాపార, మీడియా రంగాల్లో విజయవంతంగా రాణిస్తారు.
కష్టపడి పనిచేసే తత్వం
5, 14 లేదా 23 తేదీల్లో పుట్టిన వారిపై బుధుడి ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడిని గ్రహాల యువరాజుగా భావిస్తారు. అతను యువ గ్రహం కాబట్టి ఈ వ్యక్తులు తమ యవ్వనంలో చాలా చురుకుగా ఉంటారు. 25 నుంచి 45 సంవత్సరాల వయస్సులో వీరు చాలా కష్టపడి పనిచేస్తారు.
ఆకర్షణీయమైన వ్యక్తిత్వం
మూల సంఖ్య 5 గల వ్యక్తులు సంభాషణలో నిపుణులు. వారు మాట్లాడే విధానం ఆసక్తికరంగా, హాస్యభరితంగా ఉంటుంది. వారి రూపం ఇతరులను ఇట్టే ఆకర్షిస్తుంది. వీరు చాలా చురుకుగా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువగా న్యాయవాదులు, కలెక్టర్లు, వైద్యులు, జర్నలిస్టులు, జ్యోతిష్కులుగా కనిపిస్తారు. నటన, సంగీతం, ఆర్థికశాస్త్రంలో కూడా వీరు ప్రతిభావంతులు.
సవాళ్లకు భయపడరు!
సంఖ్యాశాస్త్రం ప్రకారం మూల సంఖ్య 5 కలిగిన వ్యక్తులు 25 నుంచి 45 సంవత్సరాల లోపు వారు తమ జీవితకాలంలో సంపాదించగలిగే దానికంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు సవాళ్లకు భయపడరు. సవాళ్లను ఆస్వాదిస్తారు. అందులో గెలుస్తారు.