Number1..
ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు నర దిష్టి నుండి బయటపడటానికి.. సూర్యనికి అర్ఘ్యం వదలాలి. కుడి చేతి మణికట్టుకు ఎరుపు రంగు దారం కట్టుకోవాలి. అంతేకాకుండా ఆదివారం రోజున బెల్లం దానం చేయడం వల్ల దృష్టి దోషాలు ఏమైనా ఉంటే పోతాయి.
Number2..
ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 2 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు నర దిష్టి నుండి బయటపడటానికి మీ దగ్గర ఎప్పుడూ ఒక వెండి నాణెం లేదా వెండి ముక్కను ఉంచుకోవాలి. అంతేకాదు.. శివ లింగానికి పాలాభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ మీ దరిదాపుల్లోకి కూడా రాదు.
నెంబర్ 3..
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు గురువారం రోజున మీ నుదుటిపై కుంకుమ లేదా పసుపు తిలకం దిద్దుకోండి. పసుపు రంగు రుమాలు ఎప్పుడూ దగ్గర ఉంచుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మీ దగ్గరికి కూడా రాదు.