
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
పిల్లలు కొన్ని విషయాల్లో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన రీతిలో ఉండవు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది.
కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసికంగా చికాకులు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు. ఆర్థిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. నిరుద్యోగుల కష్టం ఫలించదు. వ్యాపార, ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది.
నూతన పరిచయాల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. పాత రుణాలు తీరి ఊరట పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి.
దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. ఆదాయం అంతగా ఉండదు. ఒక వ్యవహారంలో ఇంటా బయటా సమస్యలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి.
ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారాలలో సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
డబ్బు వ్యవహారాలలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరాలకు సన్నిహితుల నుంచి డబ్బు సహాయం లభిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాల్లో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి కీలక నమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.
వృత్తి, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాల్లో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.
ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఇంటా బయటా కొన్ని పరిస్థితులు మరింత చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు వస్తాయి. ఉద్యోగులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. నూతన రుణ యత్నాలు అంతగా కలిసిరావు.
ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. పాత అప్పులు తీరుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు.
ఇంటా బయటా శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. అన్నదమ్ముల సహకారంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.