Trigrahi Yogam: ఒకే రాశిలో 3 గ్రహాల కలయిక.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!

Published : Jun 20, 2026, 02:56 PM IST

Trigrahi Yogam: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో కర్కాటక రాశిలో త్రిగ్రహి యోగం ఏర్పడనుంది. అత్యంత శుభప్రదమైన ఈ యోగం ప్రభావంతో 5 రాశులవారికి, వ్యక్తిగత జీవితం నుంచి వ్యాపారాల వరకు ఊహించని మేలు జరగనుంది. మరి ఆ అదృష్ట రాశులు ఏవో చూద్దామా..

PREV
16
కర్కాటక రాశిలో త్రిగ్రహి యోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 22న బుధ గ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించనుంది. అప్పటికే కర్కాటక రాశిలో ఉన్న గురు, శుక్ర గ్రహాలతో కలిసి త్రిగ్రాహి యోగం ఏర్పరచనుంది. ఈ మూడు గ్రహాల కలయిక కొన్ని రాశులవారికి శుభ ఫలితాలను ఇవ్వనుంది. మరి ఆ రాశులేవో వారి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం. 

26
మేష రాశి

మేష రాశివారికి త్రిగ్రహి యోగం శుభ ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, ప్రమోషన్లు వస్తాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఈ సమయంలో విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. 

36
వృషభ రాశి

వృషభ రాశి వారికి అదృష్టం పూర్తిగా కలిసివస్తుంది. పెట్టిన పెట్టుబడుల ద్వారా పెద్ద లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. మీరు చేసే మంచి పనుల వల్ల సమాజంలో గౌరవం, మర్యాద పెరుగుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది సరైన సమయం.

46
కర్కాటక రాశి

త్రిగ్రాహి యోగం కర్కాటక రాశిలోనే ఏర్పడుతోంది. కాబట్టి ఈ రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్, కెరీర్‌లో మంచి పురోగతి కనిపిస్తుంది. డబ్బు సంబంధిత విషయాల్లోనూ పెద్ద విజయం సాధించవచ్చు. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలకు లేదా విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఇంటా బయటా సంతోషమే ఉంటుంది.

56
కన్య రాశి

కన్య రాశివారికి త్రిగ్రహి యోగం మేలు చేస్తుంది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు కోలుకుంటారు. ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. ఉద్యోగం, వ్యాపారంలో మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. స్నేహితులు, శ్రేయోభిలాషుల మద్ధతు లభిస్తుంది. కుటుంబంతో మంచి సమయం గడిపే అవకాశం దొరుకుతుంది.

66
మీన రాశి

మీన రాశివారు త్రిగ్రహి యోగం ప్రభావంతో ఇల్లు, షాప్ వంటి కొత్త ఆస్తులను కొనుగోలు చేయవచ్చు. విద్య, కెరీర్, ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి. ప్రేమ, వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలు కురిపిస్తాయి. బంధువులతో ఉన్న వివాదాలు సర్దుమణుగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories