మీన రాశి..
శని గ్రహం ప్రస్తుతం మీన రాశిలోనే ఉంది. ఈ వక్రగమనం కూడా ఈ రాశిలోనే జరుగుతోంది. కాబట్టి.. ఈ మార్పు ఈ రాశివారికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఈ రాశివారి వ్యక్తిత్వం, ఆలోచన మెరుగుపడుతుంది. మంచి ఫలితాలు అందుకుంటారు. 6 నెలల కాలం వీరికి జీవితంలో చాలా గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. ఊహించని ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఆదాయాలు అందుకుంటారు. వ్యక్తిగత జీవితం కూడా చాలా ఆనందంగా మారుతుంది.