మీనరాశిలోకి శుక్రుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు...

Published : Apr 26, 2022, 09:56 AM IST

జ్యోతిష్యశాస్త్రంలో శుక్ర గ్రహాన్ని సంపద, సౌభాగ్య, శ్రేయస్సు ప్రదాతగా పరిగణిస్తారు. గురుగ్రహాన్ని అదృష్ట గ్రహంగా భావిస్తారు. శుక్రు, గురు గ్రహాలను చాలా ముఖ్యమైనవి. శుక్రుడి సంచారంతో లబ్ధిపొందే రాశుల వారికి డబ్బే డబ్బు.. అంతా శుభమే కలుగుతుంది. ఏప్రిల్ 27న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే గురుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు మీనరాశిలోకి సంచరించగానే అక్కడ సంయోగం సంభవిస్తుంది.

PREV
19
మీనరాశిలోకి శుక్రుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు...

గురువుకు మీనరాశి స్వక్షేత్రం అవుతుంది. శుక్రునికి మీనరాశి ఉచ్చ క్షేత్రం అవుతుంది. 

గురువు కారకత్వాలు :- ధనము, విద్య, పుత్రులు, జ్యేష్టభ్రాత, దేహపుష్టి, బుద్ధి, అర్థసంపద, యజ్ఞము, కీర్తి, గృహము, బంగారము, శస్త్రము, అశ్వము, మెదడు, జ్యోతిషము, వేదశాస్త్రము, శబ్దశాస్త్రము, వాహనసౌఖ్యం, యజ్ఞయాగాది క్రతువులు, కర్మ, ఆచారము, ఛాందసము, సుజనత్వము, శాంతము, మంత్రిత్వము, ఐశ్వర్యము, బంధువృద్ధి, దయ, దాక్షిణ్యము, ధర్మము, దైవభక్తి, వస్త్రము, సత్యము, తర్కము, మీమాంస, సింహాసనము, వాగ్ధోరణి, పసుపురంగు, రాజ ( ప్రభుత్వ) సన్మానం, ధర్మం, వెండి, బ్రాహ్మణులు, జ్ఞానము, కోశాగారం, నవీనగృహం, బంధుసమూహం, సుబుద్ధి, ఉత్తరదిశ, కావ్యజ్ఞానము, నిక్షేపము, వైడూర్యము, ఊరువులు, అగ్నిమాంద్యము, దంతములు, వేదవేదాంతజ్ఞానము, బ్రాహ్మణభక్తి, శ్రద్ధ, పాండిత్యం, ఉపాధ్యాయవృత్తి, ముద్రాధికారం, భ్రాతృసుఖం, సంపత్తి, బహువిధ విద్వత్తు, వ్యాకరణం, రక్తము, పిత్తాశయము, రక్తనాళములు, ఉన్నతవిద్యలపై అధికారము, వాణిజ్య విషయములు, ధన విషయములు మొదలైనవి గురుని కారకత్వములు.
 

29

శుక్రుడు కారకత్వాలు :- వివాహం, భార్య, భాగ్యం, భోగం, వాహనం, కామసుఖం, సంగీతం, విద్యాది రహస్యం, నృత్యం, సంగీతం, లలితకళలు, సరససల్లాపము, శిల్పం, జ్యోతిషం, కవిత్వం, స్త్రీ సౌఖ్యం, ఆభరణం, మణిమాణిక్యాది కారకుడు, నాటకాలంకార సాహిత్యాదులు, వ్యభిచారం, నృత్యము, ఆభరణం, ఐశ్వర్యం, ముద్రాధికారం, హాస్యం, రహస్యమోహము, వేశ్యాసంభోగం, సౌమ్యం, సౌందర్యం, శ్వేతవర్ణం, సునేత్రం, ఖండశరీరం, గర్వం, దృఢత్వం, ఆజ్ఞ, శుక్లం, శయనాగారం, మంత్రం, ఆగ్నేయదిశ, మధ్యవయస్సు, రాజముద్ర, సత్యవచనం, భరతశాస్త్రం, శ్వేతఛత్రం, వింజామరలు, ఐశ్వర్యము, సింహాసనము, సుగంధము, హేమము, రాజు, రతి, గానం, కాంతి, కళాకౌశలం, స్పర్ష, గొంతు, మూత్రపిండములు, అండకోశము, అంతఃకరణముమీద ప్రభావం, భూతదయ, ఉన్నతమైన మేధాశక్తి, సంగీతము, నాట్యము, నాటకశాలలు, పద్యకవిత్వము, చిత్రలేఖనము మొదలైన వాటికి శుక్రుడు కారకత్వం వహిస్తాడు. 

39

ఈ గ్రహాలు ఇప్పుడు ఏకమవుతున్నాయి. దీంతో ఈ రాశులలో జన్మించిన వారిని అదృష్టం వరించనుంది. శుక్రుడు మీనరాశిలోకి సంచరించగానే అక్కడ సంయోగం సంభవిస్తుంది. ఈ కలయిక మే 23 వరకు ఉంటుంది. కొన్ని రాశులవారికి అంతా శుభమే జరుగుతుంది. కేవలం శుక్ర సంచారం వల్ల కూడా మరికొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది. మరి ఆ రాశులు వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

49
Taurus

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- శుక్రుడు, గురువుల కలయిక వల్ల వృషభరాశి వారి ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, పాత అప్పులను తీర్చగలుగుతారు. వీరు తమ ప్రొఫెషనల్ లైఫ్‌లో సక్సెస్ అవుతారు. జీవితంలోని విలాసాలను ఆస్వాదిస్తారు.  ముఖ్యంగా వృషభరాశి వారు ఈ సమయంలో కెరీర్ లక్ష్యాలను నెరవేర్చడంలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా కూడా సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగస్తులకు జీతం పెరుగుదల, ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే శుక్రడి అనుగ్రహంతో మీకు ఈ కాలంలో వ్యాధి నయమవుతుంది.

59

మిథునరాశి ( Gemini) మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- మిథునరాశిలో జన్మించినవారు ఈ కలయిక వల్ల కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. కొత్తగా  ఉద్యోగాన్ని వెతుక్కునే వారికి ఈ సమయంలో అది సాధ్యమవుతుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందే సూచన కనిపిస్తుంది. మీపై అధికారుల నుండి ప్రశంసలు అందుకునే అవకాశం ఉన్నది. వ్యాపారస్తుల ఆదాయాలు పెరుగుతాయి. ఇదే సమయంలో గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలను పొందుతారు.

69

కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- కర్కాటకరాశి వారికి గురు, శుక్రుల కలయిక వల్ల విదేశాలకు వెళ్లే అవకాశం గోచరిస్తున్నది. విదేశాల నుంచి కూడా డబ్బు సంపాదించవచ్చు. ఈ సమయంలో వీరికి ఆదాయం పెరిగే బలమైన అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పరీక్షల ఇంటర్వ్యూకు హాజరుకాబోయే వారు విజయం సాధిస్తారు.

79

ధనుస్సురాశి (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- శుక్రుని సంచారం కారణంగా ధనుస్సురాశి వారికి కూడా అనుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో వీరి కెరీర్ చాలా బాగుంటుంది. ఈ సమయంలో చాలా మంది కొత్త వాహనం కొనాలని ఆలోచిస్తారు. వర్క్ చేసేవారు తమ అసలైన నైపుణ్యాలను ప్రదర్శిస్తారు.

89
Representative Image: Aquarius

కుంభరాశి (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-  ఈ సమయంలో కుంభరాశి వారిని  కూడా అదృష్టం వరిస్తుంది. కెరీర్‌లో మంచి వృద్ధి కనిపిస్తుంది. అదృష్టం వీరి వైపే ఉండటం వల్ల వీరు తమ లక్ష్యాల వైపు కదులుతూనే ఉంటారు. ఈ సమయంలో దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందడానికి డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితం కూడా చక్కగా సాగుతుంది. తండ్రితో వీరి సంబంధం గతంలో కంటే దృఢంగా మారుతుంది. 

99

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Read more Photos on
click me!

Recommended Stories