
కొందరిని చూడగానే వెంటనే నచ్చేస్తారు. కారణం వారి రూపు రేఖలు మనల్ని అలా కట్టిపడేస్తాయి. అందంగా ఉన్నవాళ్లు ఎవరికి నచ్చకుండా ఉంటారు చెప్పండి. అయితే ప్రతి ఒక్కరూ అందరిలో అందంగా కనిపించాలని కోరుకుంటారు. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.
అంటే మేకప్ వేసుకోవడం, అందంగా డ్రెస్సింగ్ చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. కానీ కొంతమంది ఏ మేకప్ వేసుకోకున్నా.. అందంగా రెడీ కాకున్నా.. బ్యూటిఫుల్ గానే కనిపిస్తారు. వీరికున్న అందమైన సహజ రూపురేఖలే ఇందుకు కారణం. ఈ విధంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని ప్రత్యేకమైన నెలల్లో పుట్టిన మహిళలు సహజంగానే అందమైన రూపురేఖలతో జన్మిస్తారట. వీరిని చూడగానే నచ్చేస్తారట. ఏ నెలలో పుట్టిన అమ్మాయిలు అందంగా ఉంటారంటే?
జ్యోతిష్యం ప్రకారం.. జూన్ నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. అంతేకాదు వీరి మనస్సు కూడా మంచిది. వీరి ప్రవర్తన కూడా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. వీరికి సహజంగానే అందమైన రూపు రేఖలు ఉంటాయి. వీళ్లు మెరిసే చర్మాన్ని, ఆకర్షణీయమైన పెదవులను, ప్రకాశవంతమైన కళ్లను, దృఢమైన శరీరాకృతిని కలిగి ఉంటారు.
వీళ్లు అందంగా రెడీ అవ్వడంలో అస్సలు వెనక్కి తగ్గరు. కానీ వీళ్లు చాలా ప్రశాంతంగా ఉంటారు. అలాగే బుద్ధిమంతులు కూడా. వీళ్లు ప్రతి విషయంలో చాలా చురుగ్గా ఉంటారు. వీరు ఏ విషయం గురించైనా చాలా ఫాస్ట్ గా ఆలోచిస్తారు. అలాగే ఈ రాశి అమ్మాయిలకు ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు. బంధాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆగస్టు నెలలో పుట్టిన అమ్మాయిలకు ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీళ్లు ఎక్కడికి వెళ్లినా చాాలా ప్రశాంతంగా ఉంటారు. వీరి ఆలోచనలను ఎవ్వరూ అంచనా వేయలేరు. వీరు చాలా అందంగా ఉంటారు. వీరికున్న అందమైన కళ్లు ఇట్టే కట్టిపడేస్తాయి. వీరు చాలా ధైర్యవంతులు కూడాను.
వీరికున్న బలమైన వ్యక్తిత్వం అందరినీ గమనించేలా చేస్తుంది. వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఏ విషయంలోనైనా నాయకత్వం తీసుకోవాలనుకుంటారు. వీరికి ఆత్మ గౌరవం ఎక్కువ. చిన్న చిన్న విషయాల్లోనూ ఎక్కడా గౌరవం తగ్గాలనుకోరు. గౌరవం తగ్గితే అస్సలు భరించలేరు.
ఈ నెలలో పుట్టిన అమ్మాయిలకు ఫ్యాషన్, అందం పై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. పైకి గంభీరంగా అనిపించినా వీరిది సున్నితమైన మనస్తత్వం. వీరు అవసరమైన వారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. ధైర్యంగా ఉంటారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అక్టోబర్ నెలలో పుట్టిన మహిళలు మంచి గుణవంతులు. వీరు కూడా అందంగా ఉంటారు. ఈ నెలలో పుట్టిన వారిని శుక్రుడు పాలిస్తాడు. వీరు మంచి నడక, ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. అందుకే వీరు వెళ్లిన ప్రతి చోటా ప్రత్యేకంగానే కనిపిస్తారు. వీరి నవ్వుకు ప్రతి ఒక్కరూ మంత్రముగ్డులు అవుతారు.
వీళ్లు గొడవలకంటే శాంతంగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతారు. వీరు అందరితో సమంగా ఉంటారు. వీరు ఒక విషయం గురించి చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వీరికి సహజంగా అందమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఇదే మిగతావారి కంటే ఎక్కువ గౌరవం పొందేలా చేస్తుంది. వీరు బయటికి ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ ఎన్నో విషయాలను దాచిపెడతారు. పర్సనల్ విషయాలను ఎవ్వరితోనూ చెప్పుకోరు.