సాధారణంగా కొందరు వ్యక్తులు సానుకూల అంశాలను మాత్రమే చూస్తారు. మరికొందరు ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలిస్తారు. ఇంకొందరు ప్రతి పనిలో ఇతరుల తప్పులను వెతుకుతూ ఉంటారు. జ్యోతిష్యం ప్రకారం ఇతరుల తప్పులను వెతికే రాశుల గురించి ఇక్కడ చూద్దాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన స్వభావం, ఆలోచనా తీరు ఉంటాయి. కొన్ని రాశులవారు సహజంగానే ఇతరులను గమనించే స్వభావం ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ పరిశీలన శక్తి కొన్నిసార్లు వారి వ్యక్తిగత బలం కాగా, మరికొన్నిసార్లు ఇతరుల తప్పులను వెతికే అలవాటుగా మారిపోతుంది. మరి ఇతరులలో తప్పులను వెతికే లక్షణం కలిగిన ఆ రాశులేంటో తెలుసుకుందామా..
25
కన్య రాశి
కన్య రాశి వారు పర్ఫెక్షన్ కోరుకుంటారు. తమ చుట్టూ ఉన్న వ్యక్తులు, పరిస్థితులు లేదా పనిలో లోపాలను కనుగొనడంలో ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇతరులు గమనించని చిన్న తప్పులను కూడా వీరు సులభంగా పసిగడతారు. వారి విమర్శ ఇతరులను బాధపెట్టడానికి కాదు.. విషయాలను మెరుగుపరచాలనే మంచి ఉద్దేశంతోనే ఉంటుంది. కానీ, వీరి నిరంతర విమర్శ కొన్నిసార్లు ఇతరులకు చికాకు కలిగించవచ్చు. వీరు ఇతరులనే కాదు, తమను తాము కూడా ఎక్కువగా విమర్శించుకుంటారు.
35
మకర రాశి
మకర రాశి వారు శని దేవుడిచే పాలించబడతారు. వీరు క్రమశిక్షణ, ఆశయం, కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉంటారు. వీరు ఏ పనినైనా ఉన్నత ప్రమాణాలతో చేస్తారు. ఇతరుల నుంచి కూడా అదే ఆశిస్తారు. లక్ష్యాలను సాధించడంపై ఎక్కువ దృష్టి పెడతారు కాబట్టి, తప్పులను సహించరు. అందుకే లోపాలను వెంటనే ఎత్తి చూపుతారు. వీరి విమర్శ కొన్నిసార్లు కఠినంగా అనిపించవచ్చు. కానీ అది పనితీరును మెరుగుపరచడానికే ఉంటుంది.
వృశ్చిక రాశి వారు స్వతహాగా తీవ్రమైన విశ్లేషకులు. వీరు దేన్నైనా లోతుగా పరిశీలించి, దానిలో దాగి ఉన్న నిజాలను, ఉద్దేశాలను కనుగొనడానికి ప్రయత్నిస్తారు. ఇతరుల ప్రవర్తన, మాటల వెనుక ఉన్న అంతరార్థాలను త్వరగా గ్రహించే అంతర్ దృష్టి వీరికి ఉంటుంది. అంతేకాదు వీరు నిజాయతీగా ఉంటారు కాబట్టి.. ఇతరుల లోపాలను ఎత్తి చూపడానికి ఏమాత్రం వెనుకాడరు.
55
కుంభ రాశి
కుంభ రాశి వారు నిజాయతీగా ఉంటారు. వీరి విమర్శ వ్యక్తిగత విషయాల కంటే సామాజిక సమస్యలు, వ్యవస్థలలోని లోపాలపైనే ఎక్కువగా ఉంటుంది. వీరు విషయాలను విస్తృత దృక్పథంతో చూసి, అందులోని లోపాలను ఎత్తి చూపుతారు. సమాజంలో లేదా ఒక వ్యవస్థలో లోపాలను చూస్తే, వాటిని సరిదిద్దాలనే తపన వీరికి ఉంటుంది. వీరు లోపాలను వెతికి మరీ వెలుగులోకి తీసుకువస్తారు.