ధనుస్సు రాశి వారికి బృహస్పతి అధిపతి. అందుకే ఈ రాశివారికి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. వీరు ఎలాంటి పరిస్థితినైనా చాకచక్యంగా ఎదుర్కొంటారు. విజయం సాధించే వరకు నిద్రపోరు. వీరు ప్రతి సమస్యను సవాళుగా భావించి ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరికున్న దృఢ సంకల్పం ప్రతిఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. విభిన్న సంస్కృతులు, జనాల మనస్తత్వాలు, పరిస్థితులను అర్థం చేసుకునే వ్యక్తిత్వం వీరిది. వీరికి అవగాహన ఎక్కువ. కాబట్టి ప్రత్యర్థుల వ్యూహాలను అర్థం చేసుకుని ముందుకు సాగుతారు.
ధనుస్సు రాశి వారు స్వేచ్ఛా మనస్తత్వం ఉన్నవారు. వీరి ఎప్పుడూ తాము నిర్ణయించుకున్న బాటలోనే ముందుకు సాగుతారు. అందుకే వీరు అంత ఈజీగా శత్రువులు పన్నిన వలలో చిక్కుకోరు. ధనుస్సు రాశి వారికి జ్ఞానం, హాస్యం ఎక్కువ. అందుకే వీరికి ప్రతి ఒక్కరూ ఆకర్షితులు అవుతారు.
(గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం జ్యోతిష్య అభిప్రాయాలు, మత గ్రంథాలు, పంచాంగం ఆధారంగా ఇవ్వబడింది. ఏషియానెట్ తెలుగు దీన్ని ధృవీకరించలేదు. సమాచారాన్ని అందించడం మాత్రమే మా ఉద్దేశం. దీని కచ్చితత్వం, విశ్వసనీయత, ఫలితాలకు ఏషియానెట్ తెలుగు ఎలాంటి బాధ్యత వహించదు)