జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో నెలలో పుట్టినవారు ఒక్కో విధంగా ఉంటారు. కొన్ని నెలల్లో పుట్టినవారు నోరు తెరిస్తే చాలు.. అన్నీ అబద్ధాలే చెప్తారట. వారు అబద్ధం చెబితే కనిపెట్టడం కష్టమట. మరి ఏ నెలల్లో పుట్టిన వారు ఎక్కువగా అబద్ధాలు చెప్తారో చూద్దాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన నెల వారి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. కొన్ని నెలల్లో పుట్టినవారు తమ భావాలను లేదా నిజాలను దాచడానికి వెనుకాడరు. వీరు నోరు తెరిస్తే చాలు.. ధారాళంగా అబద్ధాలు చెబుతారట. సాధారణంగా అబద్ధాలు చాలామంది చెప్తుంటారు. కానీ కొందరు చెప్పే అబద్ధాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. కొన్ని నెలల్లో పుట్టినవారు చెప్పే అబద్ధాలు ఇతరులు కనిపెట్టలేనంతగా ఉంటాయట. ఏ నెలలో పుట్టినవారు ఎక్కువగా అబద్ధాలు చెబుతారో ఇక్కడ చూద్దాం.
25
ఫిబ్రవరి
ఫిబ్రవరిలో పుట్టినవారు కల్పనా శక్తి కలిగి ఉంటారు. వీరు కలల ప్రపంచంలో జీవిస్తారు. వీరు భావోద్వేగ కథలను సృష్టించగలరు. వీరు చెప్పే అబద్ధాలు ఎవరూ కనిపెట్టలేనంత వాస్తవికంగా ఉంటాయి. కొన్నిసార్లు వీరు ఇతరులను బాధ పెట్టకూడదనే కారణంతో అబద్ధాలు చెబుతారు. కానీ తమను తాము రక్షించుకోవడానికి లేదా విషయాన్ని దారిమళ్లించడానికి ఎక్కువగా అబద్ధాలు చెబుతారు.
35
మే
మే నెలలో పుట్టినవారు చాలా తెలివైనవారు. పరిస్థితులను చక్కగా ఎదుర్కొంటారు. వీరికి చాలా ముఖాలుంటాయి. వ్యక్తులను బట్టి ప్రవర్తిస్తారు. అనవసర విషయాలకు కూడా అబద్ధాలు చెబుతారు. నిజమైన కథను కూడా కల్పించి వేరే కోణంలో చెబుతారు. వీరి అసలు ఉద్దేశం తెలుసుకోవడం చాలా కష్టం. పరిస్థితికి తగ్గట్టు మాటలు మార్చడంలో వీరు నిపుణులు.
ఆగస్టులో పుట్టినవారు చాలా రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి మనసులో ఏముందో తెలుసుకోవడం కష్టం. వ్యక్తిగత లాభం లేదా ఆధిపత్యం కోసం ఎక్కువగా అబద్ధాలు చెబుతారు. ఆసక్తికరమైన కథలు సృష్టించి, ఇతరులను ఆకర్షించడానికి అబద్ధాలు చెబుతారు.
55
అక్టోబర్
అక్టోబర్‌లో పుట్టినవారు ఆకర్షణీయంగా ఉంటారు. వీరు గొడవలను ఇష్టపడరు. అందుకే సమస్యలు రాకుండా ఉండేందుకు నిజాలు దాచి, అబద్ధాలు చెబుతారు. ఇతరుల ముందు గొప్పగా కనిపించాలని తమ విజయాలను, అనుభవాలను అతిశయోక్తిగా చెబుతారు. వీరి అబద్ధాలు ఎక్కువగా తమ ఇమేజ్‌ను పెంచుకోవడానికే ఉంటాయి. ఇతరులను సంతోషంగా ఉంచడానికి కూడా వీరు అబద్ధాలు చెబుతుంటారు.
గమనిక
ఈ కథనంలోని సమాచారం జ్యోతిష్య పండితుల అభిప్రాయాలు, మత గ్రంథాలు, పంచాంగం ఆధారంగా రూపొందించింది మాత్రమే. ఏషియానెట్ న్యూస్ తెలుగు దీన్ని ధృవీకరించలేదు.