Zodiac Signs: ఏ రాశివారు ఏ రోజు పెళ్లి చూపులకు వెళ్తే మంచి లైఫ్ పాట్నర్ వస్తారో తెలుసా?

Published : Jul 09, 2025, 03:44 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశివారి పెళ్లి చూపులకు కొన్ని రోజులు, నక్షత్రాలు అనుకూలమైనవి. ఆ రోజుల్లో పెళ్లిచూపులు జరిగితే శుభ ఫలితాలు కలుగుతాయి. మరి ఏ రాశి వారు ఏ రోజు పెళ్లిచూపులు చూస్తే మంచి లైఫ్ పాట్నర్ లభించే అవకాశం ఉందో ఇక్కడ చూద్దాం.

PREV
114
రాశి ప్రకారం పెళ్లిచూపులకు అనువైన రోజులు..

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లిచూపులు, నిశ్చితార్థం, పెళ్లి చాలా ముఖ్యమైనవి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి రాశికి కొన్ని రోజులు, నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజుల్లో పెళ్లిచూపులు జరిగితే శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మంచి జీవిత భాగస్వామిని పొందాలంటే రాశికి తగ్గ రోజుల్లో పెళ్లిచూపులు జరగాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఏ రాశివారికి ఏ రోజు మంచిదో ఇక్కడ చూద్దాం.

214
మేషరాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మేషరాశి వారికి బుధ, శుక్రవారాలు శుభప్రదం. రోహిణి, శ్రవణ నక్షత్రం రోజుల్లో కూడా పెళ్లిచూపులకు వెళ్లవచ్చు. ఈ రోజుల్లో పెళ్లిచూపులు జరిగితే సంతోషకరమైన వివాహ జీవితం ఉంటుంది. 

314
వృషభరాశి

వృషభ రాశి వారికి శని, శుక్రవారాలు శుభ దినాలు. ఈ రోజుల్లో వరుడికి నచ్చిన అమ్మాయి దొరికి వివాహం జరుగుతుంది. ఉత్తర, హస్త నక్షత్రాలు కూడా శుభప్రదం.

414
మిథునరాశి

ప్రేమ, ప్రశాంతత కలిగిన మిథున రాశి వారికి మంగళ, గురువారాలు పెళ్లిచూపులకు అనుకూలం. స్వాతి, రేవతి నక్షత్రాలు కూడా శుభప్రదం.

514
కర్కాటకరాశి

కర్కాటక రాశి వారికి సోమ, బుధవారాలు శుభప్రదం. అనురాధ, పుష్యమి నక్షత్రాలు కూడా శుభప్రదం. తల్లిదండ్రులు, బంధువులతో పెళ్లిచూపులకు వెళ్తే నచ్చిన అమ్మాయి దొరుకుతుంది. స్నేహితులు కూడా సహాయం చేస్తారు.

614
సింహరాశి

ఎప్పుడూ గంభీరంగా కనిపించే సింహరాశి వారికి ఆది, గురువారాలు శుభప్రదం. మఖ, ఉత్తర ఫల్గుణి నక్షత్రాలు కూడా శుభప్రదం. నచ్చిన అమ్మాయి దొరకాలంటే ఈ రోజుల్లో పెళ్లిచూపులకు వెళ్లవచ్చు.

714
కన్య రాశి

కన్యారాశి వారికి బుధ, శుక్రవారాలు శుభదినాలు. హస్త, ఉత్తర నక్షత్రాలు కూడా శుభప్రదం. సరైన రోజుల్లో పెళ్ళిచూపులు జరిగితే వివాహ జీవితం బాగుంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

814
తుల రాశి

తులారాశి వారు శుక్ర, శనివారాల్లో పెళ్లిచూపులకు వెళ్లవచ్చు. స్వాతి, ఉత్తరాషాఢ నక్షత్రాలు శుభప్రదం. ప్రేమ వివాహం అయినా, పెద్దలు కుదిర్చిన వివాహం అయినా రాశికి తగ్గ రోజుల్లో పెళ్లిచూపులు జరిగితే శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

914
వృశ్చికరాశి

వృశ్చిక రాశి వారు మంగళ, గురువారాల్లో పెళ్లిచూపులకు వెళ్లవచ్చు. అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు కూడా వీరికి శుభప్రదం.

1014
ధనుస్సురాశి

ధనుస్సు రాశి వారు గురు, ఆదివారాల్లో పెళ్లిచూపులకు వెళ్లవచ్చు. మూల, ఉత్తర ఫల్గుణి నక్షత్రాలు కూడా వీరికి శుభప్రదం.

1114
మకరరాశి

మకర రాశి వారికి శని, బుధవారాలు శుభప్రదం. శ్రవణ, ఉత్తరాషాఢ నక్షత్రాలు కూడా శుభప్రదం.

1214
కుంభరాశి

ఈ రాశివారికి మంగళ, శుక్రవారాలు శుభప్రదం. ఉత్తర, రేవతి నక్షత్రాలు కూడా కలిసివస్తాయి.

1314
మీనరాశి

మీన రాశివారికి గురు, సోమవారాలు శుభప్రదం. పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాలు కూడా కలిసివస్తాయి.

1414
ఇవి గుర్తుంచుకోండి!

పెళ్లిచూపులకు రోజు నిర్ణయించేటప్పుడు రాహుకాలం, యమగండం వంటివి లేకుండా చూసుకోవాలి. కుటుంబ సంప్రదాయాలు, జ్యోతిష్యుల సలహా తీసుకొని పెళ్లి చూపులకు రోజు నిర్ణయించుకోవాలి. శుభ ముహూర్తంలో పెళ్లిచూపులు జరిగితే వైవాహిక జీవితం బాగుంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories