Published : Feb 10, 2026, 01:48 PM ISTUpdated : Feb 11, 2026, 01:54 PM IST
Maha Shivratri 2026 : శివపురాణంలో ధనలాభం కోసం కొన్ని శివపూజా మార్గాలను వివరించారు. మహాశివరాత్రి రోజున ఈ పూజలు చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని… క్రమక్రమంగా ఐశ్వర్యవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు.
Maha Shivaratri 2026 : మహా శివరాత్రి... హిందువులు ఎంతో పవిత్రంగా భావించే రోజు. ఇది దేవదేవుడిగా కొలిచే పరమశివుడికి అత్యంత ఇష్టమైన రోజు.. అందుకే ఈరోజు శివపూజ చేస్తే ఆయన అనుగ్రహిస్తాడని నమ్ముతారు. అందుకే మహాశివరాత్రికి చాలామంది ఉపవాసం ఆచరించి స్వామిని పూజిస్తుంటారు... ఈరోజు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అయితే శివపురాణం ప్రకారం శివుడిని ప్రసన్నం చేసుకుని ఐశ్వర్యాన్ని పొందవచ్చు… ఇలా ధనవంతులయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. శివరాత్రి రోజు ఈ పూజలు మరింత ప్రభావవంతంగా ఉంటాయని శివపురాణం చెబుతోంది.
25
శివపురాణం ఏం చెబుతోంది..?
లింగరూపంలోని శివుడికి ప్రతిరోజు బియ్యంతో పూజించడం ద్వారా శుభం కలుగుతుందని శివపురాణం చెబుతోంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఇలా పూజిస్తే ధనలాభం కలుగుతుందట. మహా శివరాత్రి రోజు శివలింగాన్ని బియ్యంతో పూజించడం ద్వారా త్వరగా పలితం దక్కుతుందని శివభక్తుల నమ్మకం.
35
బియ్యానికి ఎందుకంత ప్రాధాన్యం?
శివపురాణమే కాదు జ్యోతిషం ప్రకారం కూడా బియ్యంతో శివుడిని పూజించడం మంచిదే. ఎందుకంటే బియ్యంతో శుక్రుడి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. శుక్రగ్రహం వల్లే మన జీవితంలో సుఖసంతోషాలు, సంపదలు కలుగుతాయి. ఎవరి జాతకంలో అయితే శుక్రుడు శుభస్థానంలో ఉంటాడో వారికి డబ్బుకు లోటు ఉండదు. కాబట్టి ఇలాంటి బియ్యంతో శివుడిని పూజించడం ద్వారా శుక్రుడి స్థానం బలపడి ధనలాభం కలుగుతుందని జ్యోతిషం కూడా చెబుతుంది.
అయితే శివరాత్రి రోజే కాదు ఎప్పుడైనా శివుడిని పూజించేందుకు స్వచ్చమైన బియ్యంనే వాడాలి... విరిగిన బియ్యం (నూకలు) వాడకూడదు. అంతేకాదు శివుడి పూజకు వాడే బియ్యం చాలా పవిత్రమైనవి... కాబట్టి వాటిని నిత్యం వాడే బియ్యంతో కలిపి ఉంచకూడదు... వేరుగా ఉంచాలి. వీలుంటే రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించి వాడుకోవచ్చు... ఇది ఇంకా పవిత్రమైంది. ఇలా ఎంత నిష్టతో పూజ చేస్తే అంత తొందరగా శివుడి ఆశిస్సులు లభిస్తాయి... ఆర్థిక కష్టాలు తీరతాయి.
55
శివపూజలో ఈ మంత్రాన్ని ఉచ్చరించండి..
శివరాత్రి రోజు శివుడిని పూజించే సమయంలో ప్రత్యేక మంత్రాన్ని ఉచ్చరించాలి. బియ్యం సమర్పించే సమయంలో ''అక్షతాశ్చ సురశ్రేష్ఠ కుంకుమాక్తాః సుశోభితాః.. మయా నివేదితా భక్త్యాః గృహాణ పరమేశ్వర॥'' మంత్రం ఉచ్చరించడం ద్వారా శుభ పలితాలను పొందవచ్చని శివపురాణం చెబుతోంది.
గమనిక : ఈ కథనంలోని సమాచారం ధర్మ గ్రంథాలు, పండితులు, జ్యోతిషులు నుంచి సేకరించింది. ఈ సమాచారాన్ని కేవలం మీ అవగాహన కోసం అందిస్తున్నాం. పాఠకులు దీన్ని కేవలం సూచనగా మాత్రమే పరిగణించాలి.