ధనుస్సు రాశి మహిళలు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరు చాలా ఓపెన్ నేచర్ కలిగి ఉంటారు. ఇదే గుణం వారిని చాలా ప్రేమగల, ఆసక్తికరమైన ప్రేమికులుగా చేస్తుంది. వీరికి ప్రేమ విషయంలో తుల, సింహ, మిథున, మేష, ధనుస్సు, కుంభ, కర్కాటక, మకర రాశుల వారు సెట్ అవుతారు. మకర రాశి మహిళలు పైకి గౌరవనీయులుగా, కాస్త బోరింగ్‌గా కనిపించవచ్చు. కానీ వీళ్లు లోలోపల మాత్రం చాలా రొమాంటిక్‌గా ఉంటారు. వీరికి ప్రేమ విషయంలో మీన, వృశ్చిక, కన్య, వృషభ, కర్కాటక, సింహ, ధనుస్సు రాశుల వారు సరిపోతారు.