Maha Shivratri:శివరాత్రికి వీటినే ఎందుకు ప్రసాదంగా పెడతారు..?
అసలు.. స్వామివారికి ఎలాంటి ప్రసాదాలు అర్పించాలి..? వాటినే ఎందుకు అర్పించాలి అనే విషయాలు మాత్రం తెలుసుకోవాల్సిందే.
Offer these things to lord Shiva at Shivaratri
శివరాత్రి వచ్చేస్తోంది. ఈ శివరాత్రి రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు. అంతేకాదు... రోజంతా ఆ శివయ్యను స్మరిస్తూ పూజలు చేసుకుంటారు. రకరకాల ఫుడ్స్ ప్రిపేర్ చేసి.. ఆ స్వామివారికి ప్రసాదంగా అర్పిస్తారు. అయితే....అసలు.. స్వామివారికి ఎలాంటి ప్రసాదాలు అర్పించాలి..? వాటినే ఎందుకు అర్పించాలి అనే విషయాలు మాత్రం తెలుసుకోవాల్సిందే.
1.బేల్ ఆకులు (మారేడు ఆకులు)
శివయ్యకు మారేడు ఆకులు అంటే.. అమితమైన ఇష్టమట. అందుకే... శివరాత్రి రోజు కచ్చితంగా ఆ ఆకులను శివయ్యకు సమర్పిస్తూ ఉంటారు. ఈ ఆకులను సమర్పించడం వల్ల శివయ్య ఆశీస్సులు లభిస్తాయట.
2.మారేడు ఫలం..
మారేడు ఆకులు మాత్రమే కాదు.. మారేడు ఫలం అన్నా ఆ శివయ్యకు అమితమైన ప్రేమ అంట. ఈ పండును శివయ్యకు అర్పించడం అంటే.. మన ఆత్మను సమర్పించినంత సమానమట. భక్తితో ఈ పండును సమర్పిస్తే చాలు. ఆయన ఆశీస్సులు మనకు లభిస్తాయి.
milk and honey
3.పాలు..
శివరాత్రి రోజున శివయ్యకు పాలు సమర్పించాలి. ముఖ్యంగా.. శివ లింగానికి పాలతో అభిషేకం చేయించాలి. శివలింగానికి పాలాభిషేకం చేయడం.. స్వచ్ఛతకు, భక్తిని తెలియజేస్తుంది. అంతేకాకుండా.. ఆ శివయ్య ఆశీస్సులు కూడా లభిస్తాయి.
4.తేనె..
హిందూ ఆచారాల్లో తేనెను శుభప్రదంగా భావిస్తారు. అందుకే... శివరాత్రి గురించి రోజున కచ్చితంగా ఆ శివయ్యకు తేనె సమర్పిస్తారు. ఈ తేనె తీపి, స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. దీనిని సమర్పించడం ద్వారా కూడా.. మీరు మీ భక్తిని చాటవచ్చు. శివ లింగానికి తేనెతో అభిషేకం చేయవచ్చు.
Yogurt
5.పెరుగు..
పెరుగు అనేది శివుడికి చేసే మరొక సాధారణ నైవేద్యం. ఇది భక్తి స్వచ్ఛత , శీతలీకరణ అంశాన్ని సూచిస్తుంది. భక్తులు పెరుగును పూజ్య రూపంగా సమర్పిస్తారు . శ్రేయస్సు కోసం దీవెనలు కోరుకుంటారు
6.నెయ్యి..
నెయ్యి హిందూ ఆచారాలలో ముఖ్యమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. పవిత్రమైనదిగా పరిగణిస్తారు. స్వచ్ఛత, జ్ఞానోదయం, శ్రేయస్సు చిహ్నంగా భావిస్తారు. పూజలు, ఆచారాల సమయంలో ఇది తరచుగా శివునికి సమర్పిస్తూ ఉంటారు.
Image: FreePik
7.చందనం పేస్ట్..
పూజ సమయంలో నైవేద్యంగా శివలింగానికి చందనం పేస్ట్ పూస్తారు. గంధం శీతలీకరణ లక్షణాలను కలిగి ఉందని నమ్ముతారు. ఆధ్యాత్మికంగా శుద్ధి చేసేదిగా పరిగణి'స్తారు. ఇది శివుని ఆశీర్వాదం , దైవానుగ్రహం కోసం సమర్పిస్తారు.