నవంబర్‌లో పుట్టినవారికి నీలిమణిని జన్మరత్నంగా పరిగణిస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, వృషభ, తుల, మకర, కుంభ రాశుల వారు ఈ నీలిమణిని ధరించవచ్చు. మకర, కుంభ రాశులకు శని అధిపతి. ఇక వృషభ, తుల రాశులకు అధిపతి శుక్రుడు. శుక్రుడు శనికి మిత్రుడు కాబట్టి, ఈ రాశుల వారు కూడా ధరించవచ్చని పండితులు సూచిస్తారు.
శని శుభ స్థానంలో ఉన్నప్పటికీ నీలిమణి ధరించవచ్చు. కానీ, నీలిమణితో పాటు కెంపు (మాణిక్యం), ముత్యం, పగడం వంటివి ధరించకూడదు. వాటి ప్రభావాలు దీనికి వ్యతిరేకంగా పనిచేసి, నెగటివ్ ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంది. నీలిమణి స్కై బ్లూ, స్విస్ బ్లూ, లండన్ బ్లూ టోపాజ్ అనే మూడు రంగులలో దొరుకుతుంది. ఈ రోజుల్లో ఆభరణాలలో కూడా నీలిమణిని వాడుతున్నారు. ఇది జీవితంలో సానుకూల భావనను కలిగిస్తుంది.