1.ఈశాన్య మూల...
ఇంటికి ఈశాన్య మూల చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ దిశలో లక్ష్మీదేవి, కుబేరుడు కొలువై ఉంటాడు అని నమ్ముతారు. దాదాపు ప్రతి ఇంట్లో ఈ మూలలోనే పూజ గది పెట్టుకుంటూ ఉంటారు. మీరు మీ ఇంట్లో ఈ దిశలో పూజ గది కనుక నిర్మించకపోయి ఉంటే..ఆ మూలను ఖాళీగా ఉంచకూడదు. ఆ ప్రదేశంలో మీరు నీటితో నింపిన పాత్రను ఉంచడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. లక్ష్మీ దేవి కూడా ఇంట్లోనే ఉంటుంది.
2.నైరుతి మూల...
ఇంటి నైరుతి మూలను కూడా పొరపాటున కూడా ఖాళీగా ఉంచకూడదు. వాస్తు నిపుణుల ప్రకారం, నైరుతి మూలలో ఒక అలంకరణ వస్తువును లేదా బరువైన వస్తువును ఉంచాలి. ముఖ్యంగా, ఫర్నీచర్, వార్డ్ రోబ్, సోఫా లేదా పెద్ద పూల కండీని ఉంచాలి.
ఆగ్నేయ..
ఇంటి ఆగ్నేయ దిశను అగ్ని అంటారు. మీ ఇంట్లో ఆగ్నేయ మూల ఖాళీగా ఉంటే చాలా సమస్యలు వస్తాయి. ఉత్సాహం ఉండదు. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. అలా కాకుండా.. ఈ దిశలో వంట గదిని నిర్మించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. లేదా.. ఎలక్ట్రానిక్ వస్తువులు పెట్టడం మంచిది.