ఇవి కనుక ఇంట్లో ఉంటే డబ్బుకు లోటు ఉండదు

First Published | Dec 1, 2024, 11:12 AM IST

ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచుకోవడం వల్ల అదృష్టాన్ని , సంతోషాన్ని ఇస్తుందట. అంతేకాదు.. ఆ వస్తువులు మన ఇంట్లోని చెడును బయటకు పంపించి, దరిద్రాన్ని దూరం  చేసి, సంపదను పెంచుతాయట. అవేంటో ఓసారి చూద్దాం..

నవ్వుతున్న బుద్ధుడు

లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిదట. ఇది కేవలం ఆకర్షణీయ వస్తువు మాత్రమే కాదు.. డబ్బును ఆకర్షించడంలో ముందుంటుంది. ఈ లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంటే సంతోషం, సంపదను ఆకర్షిస్తుంది. చెడు శక్తులను, ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుందని నమ్ముతారు. అయితే.. దీనిని ఎవరికి వారు కొనుక్కోకొడదట. ఎవరైనా బహుమతిగా ఇస్తే చాలా మంచిదట.

దృష్టి దోష నివారిణి

ఈ ఫోటోలో చూస్తున్నది దృష్టి బొమ్మ తాయత్తు అంటారు. చాలా అరుదుగా చూసి ఉంటారు. కానీ.. దీనిని కచ్చితంగా ఇంట్లో ఉంచుకోవాలట. ఎందుకంటే.. దృష్టి బొమ్మ తాయత్తులు చెడు శక్తులను, దుష్ట దృష్టిని తొలగించి, అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని తెస్తాయని మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాల్లో నమ్ముతారు.


ఎర్రటి కవరు

ఈ సంప్రదాయ చైనీస్ ఎర్రటి కవర్లు ఇంటికి అదృష్టాన్ని, విజయాన్ని, సానుకూల శక్తిని తెస్తాయని నమ్ముతారు. ఇవి కూడా మనకు మార్కెట్లో లభిస్తాయి.

మనీ ప్లాంట్

మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని, సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు. ఈ మొక్కను పెంచడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈజీగా ఇంట్లో ఎక్కడైనా పెంచుకోవచ్చు.

లక్కీ బ్యాంబూ

ఇది ప్రసిద్ధ ఫెంగ్ షుయ్ మొక్క. ఇది ఆర్థిక విజయం, అదృష్టం తెస్తుందని నమ్ముతారు. వెదురు కాండాల సంఖ్య వివిధ రకాల అదృష్టాన్ని సూచిస్తుంది.

Latest Videos

click me!