ఈ మధ్యకాలంలో చాలా మంది ఇళ్లల్లో అక్వేరియం ఉంటుంది. అందం కోసం లేదా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అక్వేరియాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇంట్లో అక్వేరియం ఉండటం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందట. అంతేకాకుండా అందులో కొన్ని ప్రత్యేకమైన చేపలు పెంచితే.. అద్రుష్టం వరిస్తుందా? ఇంతకీ ఆ చేపలేంటో ఓ లూక్కేండి.
16
అక్వేరియం
ఇంట్లో అక్వేరియం ఉంచుకోవడం ఇంటికి అందమే కాదు వాస్తు ప్రకారం మంచిందట. సానుకూల శక్తిని కూడా పెంచుతుంది. అందులో రంగురంగుల చేపలు ఈదుతుంటే.. చూసే వాళ్ళు తమని తాము మరిచిపోవాల్సిందే. ఇంటికి అందాన్నిచ్చే 5 అందమైన చేపల గురించి తెలుసుకుందాం.
26
రంగురంగుల గప్పీ చేపలు
1. గప్పీ చేపలు (Guppy Fish) : గప్పీ చేపలు చిన్నగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి వివిధ రంగుల్లో ఉండే ఈ చేపలను మెన్టైన్ చేయడం సులభమే. ఇవి తక్కువ ఉష్ణోగ్రతలో కూడా జీవిస్తాయి. ఇవి అక్వేరియానికి ప్రత్యేక అందాన్ని ఇస్తాయి.
36
అందమైన బెట్టా చేప
2. బెట్టా చేప (Betta Fish): బెట్టా చేపను "ఫైటర్ ఫిష్" అని కూడా అంటారు. దీని రెక్కలు, తోక చాలా అందంగా ఉంటాయి. కానీ, వీటిికి దూకుడు స్వభావం ఎక్కువ. కాబట్టి వీటిని ఒంటరిగానే ఉంచుతారు,
3. మోలీ చేప (Molly Fish) : మోలీ చేపలు చాలా ప్రశాంతంగా ఉంటాయి, ఇవి గుంపులుగా ఉండటానికి ఇష్టపడతాయి. ఇవి ఎక్కువగా నలుపు, తెలుపు, బంగారు రంగుల్లో ఉంటాయి, వీటిని పెంచడం వల్ల ఇంట్లో పాజివిట్ ఎనర్జీ జనరేట్ అవుతుందని నమ్ముతారు.
56
మెరిసే టెట్రా చేపలు
4. టెట్రా చేప (Tetra Fish): టెట్రా చేపలు అక్వేరియానికి స్సెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. వాటి మెరిసే శరీరం, గుంపులుగా ఈదే అలవాటు వల్ల అక్వేరియం మెరుస్తూ ప్రకాశవంతం చేస్తాయి. ముఖ్యంగా నియాన్ టెట్రా (Neon Tetra), కాంగో టెట్రా (Congo Tetra) వంటి రకాలు ప్రసిద్ధమైనవి.
66
బంగారు చేప - అదృష్టానికి చిహ్నం
5. బంగారు చేప (Goldfish): గోల్డ్ ఫిష్ ను శుభప్రదంగా, అదృష్టాన్ని తెచ్చే చేపగా భావిస్తారు. అలాగే.. ఈ చేపలు అక్వేరియానికి క్లాసిక్ లూక్ ను ఇస్తాయి. బంగారు రంగు సుఖసంతోషాలకు చిహ్నం . వాస్తు ప్రకారం ఇంటి లో వీటిని ఈశాన్యంలో ఉంచితే మంచిది