Zodiac signs:ఈ రాశుల వారి మనసులో ఏముందో కనిపెట్టడం ఎవరి వల్లా కాదు..!

Published : Mar 24, 2026, 05:02 PM IST

 Zodiac signs: జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారు తెరిచిన పుస్తకంలా ఉంటే, మరికొంత మంది మాత్రం అంతు చిక్కని రహస్యంలా ఉంటారు. ముఖ్యంగా కొన్ని రాశులవారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం. ఆ రాశులేంటో చూద్దాం... 

PREV
14
1.వృశ్చిక రాశి.. నిగూఢ శక్తి...

జోతిష్యశాస్త్రంలోని అన్ని రాశులలో కెల్లా ఎక్కువ సీక్రెట్స్ ఉన్న రాశి వృశ్చిక రాశి. ఈ రాశివారు తమ మనసులో ఏముంది అనే విషయాన్ని తొందరగా బయటపెట్టరు. వీరు తమ సీక్రెట్స్ బయట పెట్టకపోవడానికి కారణం లేకపోలేదు. వీరు అంత తొందరగా ఎవరినీ నమ్మరు. అందుకే ఎవరితోనూ ఏ విషయాన్ని తొందరగా పంచుకోరు. అంతేకాదు.. వీరి కళ్లల్లో ఎప్పుడూ బాధ కనిపిస్తూ ఉంటుంది. కానీ.. ఆ బాధను లోపలే దాచుకుంటారు. సంతోషమైనా కూడా వీరు ఎవరితోనూ పంచుకోరు. తమ ముఖంలో ఏ భావాన్ని బయటకు కనిపించనివ్వరు. వీరితో ఏళ్ల తరపడి స్నేహం చేసినా వారి గురించి మీరు ఏమీ తెలుసుకోలేరు. ఎదుటి వ్యక్తిని నమ్మి.. తమ వ్యక్తిగత విషయాన్ని వారు పంచుకునే వరకు వీరి విషయాలు ఎవరికీ తెలియవు.

24
2.ధనుస్సు రాశి..

ధనుస్సు రాశివారు అందరితో సరాదాగా కలిసిపోయినట్లే కనిపిస్తారు. కానీ, వారి అసలు లక్ష్యం ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే.. వీరు ఎప్పుడూ ఏదో ఒక కొత్త అన్వేషణలో ఉంటారు. వీరి తాత్విక ధోరణి వల్ల వారు చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదు. వీరు ఎవరికీ అంత ఈజీగా అర్థం కారు. ఈ రాశివారు మన పక్కనే ఉంటారు. కానీ.. వారి ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉంటాయి.

34
3.మకర రాశి..

మకర రాశి వారు చాలా గంభీరంగా ఉంటారు. చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. వీరిని అర్థం చేసుకోవడం అంటే ఒక పెద్ద కోట గోడను దాటడమే. ఎందుకంటే.. ఈ రాశివారు తమ ఎమోషన్స్ కంటే లక్ష్యాలకే ప్రాధాన్యత ఇస్తారు. లోపల ఎంత అలజడి ఉన్నా బయటకు మాత్రం చాలా ప్రశాంతంగా, డిసిప్లిన్డ్ గా కనిపిస్తారు. ఈ రాశివారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. వీరు తమ బలహీనతలను ఎవరికీ చూపించరు. అందుకే వీరు ఏం ప్లాన్ చేస్తున్నారో క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఊహించలేరు.

44
4.మీన రాశి...

మీన రాశి వారు ఈ లోకంలో ఉంటూనే మరో ఊహాలోకంలో బతుకుతుంటారు. వీరి మనస్తత్వం సముద్రమంత లోతుగా ఉంటుంది. ఎందుకంటే.. ఈ రాశివారు చాలా సున్నిత మనస్కులు. ఊహా లోకంలో ఊగిపోతూ ఉంటారు. ఒక క్షణంలో ఎంతో ప్రేమగా ఉండి, మరో క్షణంలో ఒంటరిగా మారిపోతారు. ఈ రాశివారి మౌనంలో వెయ్యి అర్థాలు ఉంటాయి. మాటల కంటే భావాల ద్వారానే ఎక్కువ కమ్యూనికేట్ చేస్తారు, అది అందరికీ అర్థం కాదు.

Read more Photos on
click me!

Recommended Stories