
మన జీవితంపై న్యూమరాలజీ ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది ముఖ్యంగా మనం పుట్టిన తేదీ ఆధారంగా చేసుకొని మన వ్యక్తిత్వం, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. మరి, ఏ నెలలో అయినా నెంబర్ 1 లో జన్మించిన వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది? వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనే వియషం ఇప్పుడు తెలుసుకుందాం...
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 1 లో పుట్టిన వారు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆత్మ విశ్వాసంతో ముందుకు నడుస్తారు. వీరు స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా కొంచెం కూడా భయపడరు. ధైర్యంగా ముందుకు సాగుతారు. ఇద వారి వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా నిలపెడుతుంది.
సంఖ్యాశాస్త్రంలో 1 అనేది ప్రారంభాన్ని, స్వతంత్రతను, ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. ఇది ఒక లీడర్ నెంబర్. ఈ సంఖ్య ఉన్నవారు తమ లక్ష్యాల కోసం చొరవ తీసుకుని ముందడుగు వేయగల సామర్థ్యం కలిగి ఉంటారు. వారి ప్రభావం ఇతరుల జీవితాలను మార్చగల శక్తిగా ఉంటుంది. అయితే ఈ ప్రభావాన్ని మంచి కోణంలో మాత్రమే ఉపయోగించాలి. అయితే.. వీరిలో మంచి లక్షణాలు మాత్రమే కాదు.. చెడు లక్షణాలు కూడా ఉన్నాయి. తాము ఏదైనా చేయలగం అనే గర్వం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అధిక ఆత్మవిశ్వాసం కొన్ని సందర్భాల్లో ఇతరుల భావాలను నిర్లక్ష్యం చేయడానికి దారి తీసే ప్రమాదం ఉంది.
ఎదురయ్యే సవాళ్లు
1వ తేదీన జన్మించిన వారు తమ అభిప్రాయాల పట్ల చాలా గట్టిగా ఉంటారు. తాము చెప్పేదే కరెక్ట్ అని, తాము చేసేది మాత్రమే ఒప్పు అనే భావన వీరిలో ఉంటుంది. దీని కారణంగా వీరు జీవితంలో ఒక్కోసారి ఒంటరిగా మిగిలిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి అందరితో కలిసి పనిచేయలేరు. తాము చెప్పిందే అందరూ వినాలని అనుకుంటారు. అలా వినని వారు వీరు కలిసి ఉండలేరు. ఎవరైనా ఏదైనా విమర్శిస్తే.. దానిని కొంచెం కూడా పాజిటివ్ గా తీసుకోలేరు. ఇలాంటి ప్రవర్తన కారణంగా ఒక్కోసారి వీరు జీవితంలో ఎదగకుండా అక్కడే ఆగిపోతారు.
1. దార్శనికత & స్వతంత్ర ఆలోచన
ఈ తేదీలో జన్మించినవారు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. వారు ట్రెండ్ ఫాలో అయ్యే వారు కాదు, కొత్త ట్రెండ్ సృష్టించే వారు. ఒక నిర్దిష్ట దిశలో ఎటువంటి సందేహం లేకుండా ముందుకు సాగగలిగే శక్తి కలిగి ఉంటారు. ఇతరులు కూడా వారి ఆత్మవిశ్వాసం వల్ల ప్రేరణ పొందతారు.
2. ఆశయవంతులు & స్ఫూర్తిదాయకులు
వారి లక్ష్యాలను సాధించాలనే తపన వీరిని ముందుకు నడిపిస్తుంది. వారు కలలు కంటారు, ఆ కలలను సాకారం చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇది వారిని సాధించాలనే సంకల్పంతో ముందుకు నడిపిస్తుంది. వారి మనోధైర్యం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుంది.
3. సహజ నాయకత్వం
వారు మాటలోనే కాదు, చేతల్లో కూడా ముందుండే నాయకులు. ఇతరుల మీద ప్రభావం చూపగల సామర్థ్యం కలిగి ఉంటారు. గుంపులో ఒకరికొకరికి సందేహాలు ఉన్నా, వీరైతే నిశ్చయంతో ముందుకు నడిపిస్తారు. వారిలో నేచురల్ కమాండింగ్ ప్రెజెన్స్ ఉంటుంది.
4. సంబంధాలలో ఎదగాల్సిన అవసరం
వారిలో ఆత్మవిశ్వాసం అధికంగా ఉన్నప్పటికీ, సాన్నిహిత్యం, భావోద్వేగ అనుబంధాల విషయంలో కొంత వెనుకబడే అవకాశముంది. వారి అత్యంత స్వాతంత్ర్య భావన దృష్ట్యా, వారు ఇతరులను తన వ్యక్తిగత జీవితంలోకి చేర్చుకోవడం కష్టంగా భావించవచ్చు. వారి లోపల దాగి ఉన్న భావాలను పంచుకోవడంలో సంకోచిస్తారు. కానీ అలా చేయడం ద్వారా వారు గాఢమైన బంధాలను ఏర్పరచుకోవచ్చు. అదే సమయంలో, ప్రశంసల కోసం మాత్రమే జీవించకుండా, వారి విలువను తాము అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.
1వ తేదీన జన్మించిన వారు సహజ నాయకులు. వారి జీవితం విజయం, శక్తి, ప్రభావం అనే మూడు విలువల చుట్టూ తిరుగుతుంది. కానీ వారు నిజమైన నాయకుడిగా ఎదగాలంటే, ఇతరులను గౌరవించగల నేర్పు, సంబంధాలను సమర్థంగా నెరవేర్చగల సామర్థ్యం కూడా కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే వారు తమ జీవిత లక్ష్యాన్ని సార్థకం చేసుకోగలుగుతారు.