Zodiac signs: 12 ఏళ్ల తర్వాత రాజయోగం, ఐదు రాశులకు ఇంతకంటే మంచి టైమ్ మరోటి ఉండదు

Published : Jun 11, 2025, 05:41 PM IST

జూన్ 15 నుంచి మిథున రాశిలో సూర్య సంచారంతో ప్రత్యేకమైన త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది. 12 ఏళ్ల తర్వాత ఈ యోగం ఏర్పడుతోంది.  

PREV
16
త్రి గ్రహ యోగం...

జోతిష్యశాస్త్రంలో గ్రహాలు తరచుగా మారుతూ ఉంటాయి. ఈ గ్రహాల మార్పులు.. అన్ని రాశులపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి. 12 ఏళ్ల తర్వాత త్రి గ్రహ యోగంజూన్ 15వ తేదీన  ఏర్పడుతుంది.

బుధాదిత్య యోగం సూర్య, బుధుల కలయికతో , భద్ర యోగం బుధుడు స్వక్షేత్రంలో ఉండటం వల్ల , ఆదిత్య యోగం సూర్య, గురువుల కలయికతో ఏర్పడుతోంది.

26
వృషభ రాశి..

వృషభం: ఈ త్రిగ్రహ యోగం వృషభ రాశి వారికి రెండవ ఇంట్లో ఏర్పడుతుంది. పూర్వీకుల ఆస్తి లాభం పొందుతారు. శుభకార్యాలకు ఖర్చు చేస్తారు, మనశ్శాంతి లభిస్తుంది. ఎక్కడైనా మీ డబ్బు ఆగిపోతే..తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీ మాటలతో జనాల మనసులను గెలుచుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

36
తుల రాశి..

తుల: ఈ యోగం భాగ్యస్థానంలో (9వ ఇల్లు) ఏర్పడుతుంది. తండ్రి నుంచి మద్దతు లభిస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రల ద్వారా లాభం కలుగుతుంది. ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో విజయం లభిస్తుంది. బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.

46
మిథున రాశి..

మిథునం: త్రిగ్రహ యోగం మిథున రాశి వారికి బాగా కలిసొస్తుంది. వృత్తిలో విజయం లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా ధనలాభం కలుగుతుంది. జ్ఞానం, నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. మానసిక స్థితి బలంగా ఉంటుంది.

56
కుంభ రాశి..

కుంభం: ఐదవ ఇంట్లో త్రిగ్రహ యోగం, ఏలినాటి శని చివరి దశ ప్రభావవంతంగా ఉంటుంది. వృత్తిలో కృషి ఫలిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. ధార్మిక యాత్ర చేసే అవకాశం.

66
ధనస్సు రాశి..

ధనుస్సు: ధనుస్సు రాశి వారు సూర్య, బుధ, గురువుల 7వ దృష్టిలో ఉంటారు. దాంపత్య జీవితంలో సంతోషం, శాంతి కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారంలో లాభం కలుగుతుంది. కార్యస్థలంలో సహకారం పెరుగుతుంది. పెళ్లి సంబంధ విషయాల్లో విజయం. నిర్ణయాలు తీసుకునే శక్తి బలపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories