Birth Stars: 2026 లో ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి కష్టాలు తప్పవు..!

Published : Dec 27, 2025, 05:47 PM IST

 Birth stars: జోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు మన జీవితంపై చాలా ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా 2025లో శని, రాహు-కేతు సంచారాలు కొన్ని నక్షత్రాలపై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆ నక్షత్రాలేంటో చూద్దాం... 

PREV
13
2026 Horoscope

1.ఆశ్లేష నక్షత్రం...

ఈ నక్షత్రంలో పుట్టిన వారికి 2026లో సమస్యలు కాస్త ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో కలహాలు రావచ్చు. జీవితంలో ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో అయోమయానికి గురౌతారు. మరీ ముఖ్యంగా ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి.

2.మూల నక్షత్రం....

మూల నక్షత్రానికి చెందిన వారిపై శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. 2026లో ఈ నక్షత్రంలో పుట్టిన వారికి పనిలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు ఎదురవ్వొచ్చు.కానీ, ఓపికతో ఉంటే.. మీ కష్టాలు అనుభవాలుగా మారతాయి. ధైర్యంగా ఉంటే సంవత్సరం చివరికి పరిస్థితి మెరుగుపడొచ్చు.

23
3.పునర్వసు నక్షత్రం...

పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారికి 2026లో అనుకోని కష్టాలు రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు రావచ్చు. ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏ పని మీద ఏకాగ్రత ఉండదు. ముఖ్యంగా, ఇతరుల మాటలకు తొందరగా ప్రభావితమవ్వకుండా నిర్ణయాలు తీసుకోవాలి. నమ్మకంతో వ్యవహరించాలి.

4.వైశాఖ నక్షత్రం....

విశాఖ నక్షత్రానికి చెందిన వారికి కూడా 2026 లో చాలా ఇబ్బందులు రావచ్చు. ఉద్యోగంలో అనుకోని మార్పులు వస్తాయి. ఉద్యోగంలో అధిక బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మానసికంగా చాలా అలసటగా ఉంటారు. కానీ, కష్టపడి పని చేస్తే... దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి విషయానికీ ఆవేశపడకుండా ఉండాలి.

33
రేవతి నక్షత్రం...

రేవతి నక్షత్రంలో పుట్టిన వారికి కూడా 2026 లో అనుకోని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేరు. నిద్రలేమి సమస్యలు ఎదురౌతాయి. ధ్యానం, ఆధ్యాత్మిక అలవాట్లు, పూజలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

2026 కష్టాలు తగ్గించుకోవడానికి చేయాల్సినవి...

శని సంబంధిత దానాలు అంటే నల్ల నువ్వులు, నువ్వుల నూనె దానం చేయాలి. శనివారం హనుమాన్ పూజ చేయాలి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. అనవసరమైన వాదనలు దూరం పెట్టాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

ఫైనల్ గా..

2026లో కొన్ని నక్షత్రాలకు సవాళ్లు ఉన్నప్పటికీ, ఇవి శాశ్వత కష్టాలు కావు. సరైన నిర్ణయాలు, ఓర్పు, ఆధ్యాత్మిక నమ్మకం ఉంటే ఈ దశను విజయవంతంగా దాటవచ్చు.కష్టం అనేది మార్పుకు సంకేతం మాత్రమే — అది శిక్ష కాదు.

Read more Photos on
click me!

Recommended Stories