అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి
వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు ఇవాళ కాకినాడలో బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ , యానాం కు చెందిన మాజీ మంత్రి మల్లాడ్డి కృష్ణారావు హాజరు కానున్నారు.
అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి
గత కొంతకాలంగా వైఎస్ఆర్‌సీపీ నాయకత్వంపై పిల్లి సుభాష్ చంద్రబోస్ అసంతృప్తితో ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం నుండి పిల్లి సుభాష్ చంద్రబోస్ పలు దఫాలు విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో రామచంద్రాపురం అసెంబ్లీ స్థానంలో చెల్లుబోయిన వేణుగోపాల్ కు వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు దక్కింది.
అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి
మండపేట నుండి మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు దక్కింది. మండపేటలో టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు చేతిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓటమి పాలయ్యారు. దీంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఆ పార్టీ నాయకత్వం ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి మంత్రి పదవిని కట్టబెట్టింది. అయితే పార్టీ అవసరాల రీత్యా పిల్లి సుభాష్ చంద్రబోస్ ను మంత్రి వర్గం నుండి తప్పించారు జగన్. ఆయనను రాజ్యసభకు పంపారు. ఇదే జిల్లా నుండి చెల్లుబోయిన వేణుగోపాల్ ను జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి
2024 ఎన్నికల్లో రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం నుండి తన కొడుకు పిల్లి సూర్యప్రకాష్ కు టిక్కెట్టు ఇవ్వాలని కోరుతున్నారు. వైఎస్ఆర్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల జిల్లాకు చెందిన పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరు కాలేదు. వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుండి మంత్రి చెల్లుబోయిన వేణు పోటీ చేయనున్నారని మిథున్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన పిల్లి సుభాష్ చంద్రబోస్ అసంతృప్తికి కారణంగా చెబుతున్నారు.
అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి
అవసరమైతే ఇండిపెండెంట్ గా వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుండి తన కొడుకును బరిలోకి దింపాలని భావిస్తున్నారని ప్రచారం. ఈ క్రమంలోనే బీసీ ఆత్మీయ సమ్మేళనాన్ని ఇవాళ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి యానాంకు చెందిన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావుకు కూడ ఆహ్వానం అందింది. కానీ బీసీ సామాజిక వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుకు మాత్రం ఈ సమావేశానికి ఆహ్వానం అందలేదు.
అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి
రామచంద్రాపురం అసెంబ్లీ స్థానంలో గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించిన విషయాన్ని సుభాష్ చంద్రబోస్ తన వర్గీయుల వద్ద ప్రస్తావించినట్టుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.ఈ సమావేశం ద్వారా పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గం వైఎస్ఆర్‌సీపీ నాయకత్వానికి ఏం చెప్పనుందోనని రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వైఎస్ జగన్ తో పిల్లి సుభాష్ చంద్రబోస్ వెన్నంటి ఉన్నారు. అయితే వైసీపీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు.