టీడీపీపై అసంతృప్తి: వైఎస్ఆర్‌సీపీ వైపు రాయపాటి కుటుంబం చూపు?

First Published | Jul 14, 2023, 12:15 PM IST

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుటుంబం వైసీపీ వైపు చూస్తుందనే  ప్రచారం సాగుతుంది.  కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతలు ఇవ్వడంతో   రాయపాటి సాంబశివరావు  కుటుంబం అసంతృప్తితో ఉందని సమాచారం.
 

టీడీపీపై అసంతృప్తి: వైఎస్ఆర్‌సీపీ వైపు రాయపాటి కుటుంబం చూపు?

గుంటూరు: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుటుంబం  వైసీపీ వైపు చూస్తుందని ప్రచారం సాగుతుంది.కొందరు వైసీపీ నేతలు కూడ  రాయపాటి కుటుంబంతో టచ్‌లోకి వెళ్లినట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై  రాయపాటి కుటుంబం నుండి  అధికారికంగా స్పందించలేదు.   మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడంతో  రాయపాటి సాంబశివరావు కుటుంబం అసంతృప్తితో ఉంది. 

టీడీపీపై అసంతృప్తి: వైఎస్ఆర్‌సీపీ వైపు రాయపాటి కుటుంబం చూపు?

రాయపాటి సాంబశివరావు తనయుడు  రంగబాబు  సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని భావించాడు. అయితే  ఈ అసెంబ్లీ స్థానానికి  కన్నా లక్ష్మీనారాయణను  టీడీపీ ఇంచార్జీగా చంద్రబాబు నియమించారు. ఈ పరిణామం  రాయపాటి సాంబశివరావు కుటుంబానికి పుండు మీద కారం చెల్లినట్టుగా  అయిందని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

Latest Videos


టీడీపీపై అసంతృప్తి: వైఎస్ఆర్‌సీపీ వైపు రాయపాటి కుటుంబం చూపు?

2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన  రాయపాటి సాంబశివరావు  టీడీపీలో చేరారు. 2014 లో నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా  రాయపాటి సాంబశివరావు  పోటీ చేసి విజయం సాధించారు.  అయితే 2019  ఎన్నికల సమయంలో రాయపాటి సాంబశివరావుకు  ఈ స్థానం నుండి టిక్కెట్టు ఇచ్చే విషయమై  చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు.  అయితే  ఈ విషయమై తర్జన భర్జనలు చేశారు. చివరి నిమిషంలో రాయపాటి సాంబశివరావుకు  టిక్కెట్టు ఇచ్చారు. అయితే  ఈ స్థానంలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు చేతిలో రాయపాటి సాంబశివరావు  ఓటమి పాలయ్యాడు.  ఈ సమయంలో  రాయపాటి సాంబశివరావు  తనయుడు రంగబాబుకు  అసెంబ్లీ స్థానాన్ని ఆశించాడు. అయితే  ఎంపీ స్థానం మాత్రమే  రాయపాటి సాంబశివరావు కుటుంబానికి దక్కింది

టీడీపీపై అసంతృప్తి: వైఎస్ఆర్‌సీపీ వైపు రాయపాటి కుటుంబం చూపు?

అయితే ఏపీ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులతో  కన్నా లక్ష్మీనారాయణ  టీడీపీలో చేరారు.  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో రాయపాటి సాంబశివరావు,  కన్నా లక్ష్మీనారాయణలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా పొసగలేదు.  రాయపాటి సాంబశివరావుపై  చేసిన  చేసిన విమర్శలపై కన్నా లక్ష్మీనారాయణ  పరువు నష్టం దావా వేశారు.  ఇటీవలనే  ఈ కేసులో  వీరిద్దరూ రాజీ పడ్డారు.  

టీడీపీపై అసంతృప్తి: వైఎస్ఆర్‌సీపీ వైపు రాయపాటి కుటుంబం చూపు?

ఈ కేసు ముగిసిన కొన్ని రోజుల్లో కన్నా లక్ష్మీనారాయణ  టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.  టీడీపీలో  చేరిన తర్వాత  తమ మధ్య గ్యాప్ ను  పూడ్చుకొనేందుకు  కన్నా లక్ష్మీనారాయణ ప్రయత్నాలు  చేశారు.  

టీడీపీపై అసంతృప్తి: వైఎస్ఆర్‌సీపీ వైపు రాయపాటి కుటుంబం చూపు?

ఇదిలా ఉంటే సత్తెనపల్లి  అసెంబ్లీ నియోజకవర్గానికి   కన్నా లక్ష్మీనారాయణను  ఇంచార్జీగా నియమించడంతో  రాయపాటి సాంబశివరావు కుటుంబం అసంతృప్తికి కారణమైంది.  రాయపాటి రంగబాబు ఈ స్థానం నుండి పోటీ చేయాలని భావించారు.  

టీడీపీపై అసంతృప్తి: వైఎస్ఆర్‌సీపీ వైపు రాయపాటి కుటుంబం చూపు?

ఈ పరిణామాలపై టీడీపీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న  రాయపాటి  సాంబశివరావు కుటుంబం  వైసీపీలో చేరాలని భావిస్తున్నట్టుగా  సమాచారం.  మాజీ మంత్రి, వైసీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్  ద్వారా   రాయపాటి సాంబశివరావు కుటుంబం జగన్  పార్టీలో చేరేందుకు  ప్రయత్నిస్తుందని  ప్రచారం సాగుతుంది.  అయితే  ఈ విషయమై  రాయపాటి సాంబశివరావు కుటుంబం నుండి  అధికారికంగా ఎవరూ  స్పందించలేదు.

click me!