రఘురామకృష్ణంరాజు ఇష్యూ: కేంద్ర మంత్రులతో ఎంపీ బాలశౌరి వరుస భేటీలు, ఏం జరుగుతోంది?

First Published Jun 29, 2020, 4:52 PM IST

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఘటనలో వైసీపీ నాయకత్వం ఏ రకంగా వ్యవహరిస్తోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. వైసీపీ ఎంపీ బాలశౌరి కేంద్ర మంత్రులతో వరుసభేటీలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకొన్నాయి. 

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అనుసరించిన వ్యూహానికి వైసీపీ కౌంటర్ వ్యూహాంతో ముందుకు వెళ్తోంది.వైసీపీ ఎంపీ బాలశౌరి ఢిల్లీలో వరుసుగా కేంద్ర మంత్రులతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
undefined
గత వారంలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులకు కూడ ఫిర్యాదు చేశాడు. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, హోం సెక్రటరీ అజయ్ భల్లాలను కూడ ఆయన కలిశారు. అంతేకాదు తనకు రక్షణ కల్పించాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు వినతి పత్రం పంపారు.
undefined
పశ్చిమగోదావరి జిల్లాలోని వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీ రఘురామకృష్ణంరాజుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇరు వర్గాల మధ్య విమర్శలు చోటు చేసుకొన్నాయి. ఈ తరుణంలోనే ఈ నెల 22వ తేదీన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు పంపారు.
undefined
ఈ నోటీసుపై సాంకేతిక అంశాలను కూడ రఘురామకృష్ణంరాజు తెరమీదికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి కూడ తీసుకొచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
undefined
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఇవాళ రఘురామకృష్ణం రాజు ఆరు పేజీల లేఖను రాశాడు. ఈ లేఖ ప్రతిని ఆయన మీడియాకు కూడ విడుదల చేశాడు.గత వారం రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలవడంతో వైసీపీ కూడ ప్రతి వ్యూహాంతో ముందుకు వెళ్తోంది.
undefined
ఆదివారం నాడు సాయంత్రం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కలిశారు. రఘురామకృష్ణంరాజుకు పార్టీ నాయకత్వం షోకాజ్ జారీ చేసిన విషయాన్ని వివరించినట్టుగా తెలుస్తోంది.
undefined
ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో 30 నిమిషాల పాటు బాలశౌరి భేటీ అయ్యారు. రాజ్ నాథ్ సింగ్ భేటీ తర్వాత మరో ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రహ్లద్ జోషీ, సదానంద గౌడలతో బాలశౌరి భేటీ అయ్యారు. గంటల వ్యవధిలోనే బాలశౌరి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
undefined
రఘురామకృష్ణంరాజు ఇవాళే సీఎం జగన్ కు వివరణ కూడ పంపారు. ఈ తరుణంలో ఈ భేటీలపై ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఈ లేఖపై వైసీపీ నాయకత్వం ఏ రకంగా స్పందిస్తోందోననే ది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
undefined
click me!