సుమారు 82 రోజుల తర్వాత భక్తులకు తిరుమల వెంకన్న దర్శనం గురువారం నాడు ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 20వ తేదీ నుండి భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. ఇన్ని రోజుల పాటు ఆలయం మూసివేయడం చరిత్రలో ఇదే తొలిసారి.
undefined
కరోనాను నిరోధించేందుకు గాను దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించారు. ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ను విధించింది కేంద్రం. అయితే అదే సమయంలో పలు రంగాల్లో లాక్ డౌన్ ఆంక్షలపై సడలింపులు ఇచ్చారు. ఈ సడలింపుల నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతి ఇచ్చారు.
undefined
ఈ నెల 8వ తేదీ నుండి శ్రీవారి దర్శనానికి అనుమతి లభించింది. రెండు రోజుల పాటు టీటీడీలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే దర్శనం కల్పించారు. ఈ నెల 10వ తేదీన తిరుమల, తిరుపతికి చెందిన స్థానికులకు స్వామిని దర్శించుకొనే వెసులుబాటు ఇచ్చారు.
undefined
ఈ నెల 11వ తేదీ నుండి దేశంలోని పలు ప్రాంతాల్లోని భక్తులకు బాలాజీ దర్శనాన్ని కల్పించారు. ఇవాళ ఉదయం ఆరున్నర గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.
undefined
ప్రతి గంటకు 500 మంది చోప్పున భక్తులకు స్వామిని దర్శించుకొనేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ప్రతి రోజూ 7 వేల మందికి మాత్రమే భక్తులు దర్శించుకొనేలాల టోకెన్లు జారీ చేస్తోంది.ప్రతి రోజూ మూడువేల టోకెన్లను ఆన్ లైన్ లో జారీ చేస్తారు. మిగిలిన నాలుగువేల టోకెన్లను ఆఫ్ లైన్లో జారీ చేస్తున్నారు.
undefined
లాక్ డౌన్ ఆంక్షల్లో భాగంగా ప్రతి రోజూ రాత్రి 9 గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూ ఉంది. దీంతో సాయంత్రం ఏడున్నర గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం కేటాయిస్తున్నారు.
undefined
మరో వైపు ఈ నెల 15, 16, 17 తేదీల్లో కూడ తిరుమల, తిరుపతికి చెందిన స్థానికులకు కూడ తిరుమల శ్రీనివాసుడి దర్శనం కల్పించనున్నారు. ఈ మేరకు టీటీడీ టోకెన్లు జారీ చేస్తోంది.
undefined
ఈ నెల 8వ తేదీన 6500 మంది టీటీడీ ఉద్యోగులు, రెండోరోజు 8500 మంది స్వామివారిని దర్శించుకొన్నారు. మూడో రోజున 7100 మంది వెంకన్న దర్శనం చేసుకొన్నారు. మూడు రోజుల్లో 21,982 మందిని భక్తులు దర్శించుకొన్నారు. అంతేకాదు 45.95 లక్షల హుండి ఆదాయం వచ్చినట్టుగా టీటీడీ ప్రకటించింది.
undefined
ఇదిలా ఉంటే ఈ నెల 20వ తేదీ వరకు ఆన్ లైన్ వెంకన్న దర్శనం కోసం టోకెన్లు బుక్ అయ్యాయి. లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ ప్రతి రోజూ 10 వేల మంది భక్తులకు త్వరలో స్వామిని దర్శించుకొనేలా ఏర్పాట్లు చేస్తామని టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
undefined