అధికార వైసిపికి బిగ్ షాక్ ... టిడిపిలో చేరిన సుభాష్ చంద్రబోస్

Published : Jun 30, 2023, 02:25 PM IST

కృష్ణా జిల్లాకు చెందిన వైసిపి నేత సుభాష్ చంద్రబోస్ మాజీ సీఎం, టిడపి చీఫ్ చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

PREV
17
అధికార వైసిపికి బిగ్ షాక్ ... టిడిపిలో చేరిన సుభాష్ చంద్రబోస్
TDP

మంగళగిరి : ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ అధికార వైసిపికి షాక్ తగిలింది. కృష్ణా జిల్లా వైసిపి ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ వైసిపిని వీడారు. తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి తాజాగా చంద్రబోస్ తెలుగుదేశం పార్టీలో చేరారు. టిడిపి చీఫ్  చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టిడిపిలో చేరారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. 
 

27
TDP

వైసిపి పాలనలో అదోగతి పాలయిన ఏపీని కాపాడటం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని నమ్మి తమతో కలిసి పనిచేయడానికి సిద్దమైన చంద్రబోస్ ను అభినందిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఆయనతో పాటు మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసిలు, భారీగా అనుచరులు చేరడంతో కృష్ణా జిల్లాలో టిడిపికి మరింత బలం చేకూరిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి  గెలిస్తే రాష్ట్రం గెలిచినట్లేనని... అప్పుడే ప్రజలకు మంచి జరుగుతుందని చంద్రబాబు అన్నారు. 

 

37
TDP

తెలంగాణలో హైదరాబాద్ మాదిరిగానే ఏపీలో అమరావతిని అభివృద్ది చేయాలని భావించానని చంద్రబాబు పేర్కొన్నారు. అందుకోసమే రైతులను ఒప్పించి భూములు తీసుకుని నిర్మాణం మొదలుపెట్టాం... అంతలోనే ఎన్నికలు వచ్చి వైసిపి అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మూడు రాజధానులు అంటూ అమరావతి నిర్మాణాన్ని ఆపేసాడన్నారు. అమరావతి పూర్తయివుంటే మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చివుండేవని చంద్రబాబు అన్నారు. 

47
TDP

కృష్ణా డెల్టా నీటికష్టాలు తీర్చేందుకు కేవలం ఏడాది కాలంలోనే పట్టిసీమను నిర్మించామని చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వం నిర్మించిన పట్టిసీమ నీళ్లు తాగి తమనే మరిచిపోయారని అన్నారు. ఓ అసమర్థుడు, అవినీతిపరుడిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసారని చంద్రబాబు అన్నారు. 

 

57
TDP

వైసిపి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్  నిర్మాణ సంస్థలను, అధికారులను మార్చి తీవ్ర నష్టం చేసారని చంద్రబాబు అన్నారు. టిడిపి ప్రభుత్వ ఐదేళ్లతో ఎంతో కష్టపడి పనులుచేస్తే అదంతా బూడిదపాలు చేసారన్నారు. పోలవరం పోయింది... అమరావతి పోయింది అంటూ చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. 

67
TDP

ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంవల్ల బాగుపడిన ఒకే ఒక్కడు జగన్ రెడ్డి అని చంద్రబాబు అన్నారు. ఎన్నికల సమయంలో మద్యపాన నిషేదం అన్నాడు... అధికారంలోకి వచ్చాక లక్ష కోట్ల మద్యం అమ్ముకున్నాడని ఆరోపంచారు. మద్యం షాపుల్లో ఆన్లైన్ పేమెంట్లు ఎందుకు అనుమతించడం లేదు? అని చంద్రబాబు ప్రశ్నించారు. 

 

77
TDP

వైసిపి పార్టీని, వైఎస్ జగన్ ఓడించడానికి అన్ని వర్గాలు తమతో కలిసి రావాలని చంద్రబాబు కోరారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రాన్ని గెలిపించుకునేందుకు 'సైకో పోవాలి....సైకిల్ రావాలి' నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు.  
 

click me!

Recommended Stories