ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఎస్. కోట అసెంబ్లీ స్థానం నుండి మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి చంద్రబాబునాయుడు లైన్ క్లియర్ చేశారు. ఇదే అసెంబ్లీ స్థానం నుండి జి. కృష్ణ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్. కోట నుండి కోళ్ల లలిత కుమారి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఈ నియోజకవర్గంలో కోళ్ల లలితకుమారి, జి. కృష్ణ వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కోళ్ల లలిత కుమారి పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉందని ప్రచారం సాగింది. అయితే ఎస్. కోట నుండి పోటీకి కోళ్ల లలిత కుమారికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.