కేవలం 2వేల ఇళ్లలో లక్షా ఎనభైవేల ఓటర్లా..! ఇది ఎనిమిదో వింతే..: అచ్చెన్నాయుడు సీరియస్

Published : Jun 28, 2023, 03:22 PM IST

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెెలవాలని భావిస్తున్న వైసిపి వాలంటీర్ల సాయంతో భారీగా దొంగఓట్లను సృష్టిస్తోందని ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

PREV
18
కేవలం 2వేల ఇళ్లలో లక్షా ఎనభైవేల ఓటర్లా..! ఇది ఎనిమిదో వింతే..: అచ్చెన్నాయుడు సీరియస్
TDP

అమరావతి :ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని వనరులను దోచుకున్న వైసిపి దొంగల ముఠా ఎన్నికల ఏడాది ఓట్ల దొంగతనానికి తెరతీసిందని టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడమే కాదు భారీగా దొంగఓట్లు స‌ృష్టిస్తున్నారని అన్నారు. వాలంటీర్స్, బీఎల్ఓ ల ద్వారా ఈ అవకతవకలకు పాల్పడుతున్న అచ్చెన్నాయుడు ఆరోపించారు. 
 

28
TDP

 కేవలం 2150 ఇళ్ల నంబర్లతో ఏకంగా లక్షా ఎనబైఐద వేల ఓటర్లను చేర్పించారంటే ఏ స్థాయిలో దొంగఓట్లను సృష్టిస్తున్నారో అర్థంచేసుకోవచ్చని అచ్చెన్నాయుడు అన్నారు. ఒక్కో ఇంటినంబర్ తో వందలాది ఓట్లు నమోదవుతున్నాయని అన్నారు. ఏపీలో జరుగుతున్న దొంగఓట్ల వ్యవహారం ఖచ్చితంగా ఎనిమిదో వింతేనని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేసారు. 

38
TDP

ఆంధ్ర ప్రదేశ్ లో ఓట్ల తొలగింపు, చేరికల్లో అధికారపార్టీ  అవకతవకలకు పాల్పడుతోందంటూ అచ్చెన్నాయుడు నేతృత్వంలోని టిడిపి బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. సచివాలయంలో సీఈవో ముఖేష్ కుమార్ మీనాను కలిసిన టిడిపి బృందం తమ దృష్టికి వచ్చిన వివిధ అవకతవకలపై ఈసీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసారు. దీనిపై విచారణ చేయించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు టిడిపి నేతలు. 
 

48
TDP

 ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... వైసిపి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో దొంగలు పడ్డారని టిడిపి చెప్పిందన్నారు. ఈ నాలుగేళ్లలో తాము చెప్పినట్లు రాష్ట్రంలోని అన్ని వనరులను దోచుకున్న వైసిపి దొంగలు చివరకు భారత రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును కూడా దొంగిలిస్తోందని అన్నారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక ఏ ఎన్నికా సవ్యంగా జరగలేదని... అందుకే వైసిపి గెలిచిందన్నారు. 

58
TDP

సాధారణంగా ఏ ప్రభుత్వంపై అయినా ఎన్నికల సమయానికి ఏదో ఒక వర్గంలో, కొంతమందిలో వ్యతిరేకత రావడం సహజమని  అచ్చెన్నాయుడు అన్నారు. కానీ ప్రస్తుతం ఐదుకోట్ల అంద్రుల్లోనూ వైసిపి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు.  
 

68
TDP

 వైసిపి ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు ఓట్ల తొలగింపు, చేర్పడంతో అవకతకవలకు పాల్పడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఓట్లు తొలగించాలంటే ఎంతో ప్రక్రియ ఉంటుందని... అవేమీ లేకుండానే వాలంటీర్లు తేలిగ్గా తొలగించేస్తున్నారని అన్నారు. ఒకే ఇంట్లో వుండే కుటుంబసభ్యులను వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు మార్చడం ఏమిటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. 

78
TDP

 తమ ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించిన ప్రధాన ఎన్నికల అధికారి జూలై నుండి  ఓటరు జాబితా తనిఖీలు చేపడతామని హామీ ఇచ్చారని అచ్చెన్న తెలిపారు. ఈ తనిఖీల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడాలని తాము కోరినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. అక్టోబర్ నాటికి ముసాయిదా జాబితా వస్తుందని... ఆలోగా పొరపాట్లను సవరిస్తామని సీఈవో చెప్పారన్నారు. 

88
TDP

ఓట్ల తొలగింపు, చేర్పుల్లో అక్రమాలకు పాల్పడితే కిందిస్థాయి ఉద్యోగులపైనే కాదు ఎమ్మార్వో, కలెక్టర్లపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధానాధికారి తెలిపారని అచ్చెన్న అన్నారు. ఈసీ తనిఖీల్లో టిడిపి కూడా పాలుపంచుకుంటుందని... వైసిపి అవకతవకలను బయటపెడుతుందని అచ్చెన్నాయుడు తెలిపారు. 

click me!

Recommended Stories