Weather : తెలుగోళ్లు బిఅలర్ట్ ... మీకు ఏ సాయం కావాలన్నా ఈ టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయండి

Published : May 22, 2025, 07:57 AM ISTUpdated : May 22, 2025, 08:13 AM IST

తెలుగు ప్రజలారా బీఅలర్ట్. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతుండగా మరికొద్దిరోజులు ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండి హెచ్చరిస్తోంది. పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆపద సమయంలో సాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుచేసారు. 

PREV
15
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు

Rain Alert : వేసవికాలం ఇంకా ముగియనేలేదు.. అప్పుడే దేశవ్యాప్తంగా వర్షాలు మొదలయ్యాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గత రెండుమూడు రోజులుగా మబ్బులు కమ్మేసి వాతావరణం చల్లబడింది... వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ తో సహా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో అన్నిప్రాంతాల్లో నేడు, రేపు (మే 22, 23) మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ప్రస్తుతం బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతోందని... ఇది అల్పపీడనం, వాయుగుండంగా మారి భారీ వర్షాలకు కారణమయ్యిందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక మధ్య అరేబియా సముద్రంలో మరో ఆవర్తనం కొనసాగుతోంది.. ఇది కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు కారణమమవుతోంది. ఇలా వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉండటంతో మరికొన్నిరోజులు ఇలాగే వర్షాలు దంచికొడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

25
ఆంధ్ర ప్రదేశ్ లో నేడు వర్షసూచన గల జిల్లాలివే :

ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రెండ్రోజులు(గురు, శుక్ర) వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. చాలాప్రాంతాల్లో మోస్తరు వర్షాలే కురుస్తాయని... అక్కడక్కడ మాత్రం భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించారు.

ఇక రేపు (శుక్రవారం) కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు. నంద్యాల, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

35
అత్యవసర సాయంకోసం టోల్ ఫ్రీ నంబర్లు

ఇలా రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలకు తోడు పిడుగులు పడే అవకాశాలున్నాయి. అలాగే గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలున్నాయి. దీంతో విపత్తు నిర్వహణ సంస్థ కంట్రోల్ రూం ఏర్పాటుచేసింది... అత్యవసర సమయంలో సహాయం కోసం టోల్‌ ఫ్రీ నెంబర్లు 1070,112, 18004250101 ఫోన్ చేయాలని సూచించారు.

45
తెలంగాణలో వర్షసూచన గల జిల్లాలివే

తెలంగాణలో కూడా సాధారణం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏయే జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందో వాతావరణ శాఖ ప్రకటించింది.

నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, గద్వాల, మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ జిల్లాల వ్యాప్తంగా మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

55
అధికారులను అలర్ట్ చేసిన సీఎం రేవంత్

ఇక తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలిచ్చారు. వాతావరణ సూచనల మేరకు వర్షాలు కురిసే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని... లోతట్లు ప్రాంతాల ప్రజలకు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. రైతుల ధాన్యం తడవకుండా చూడాలని.. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని సూచించారు. హైదరాబాద్ తో పాటు మిగతా పట్టణాల్లో రోడ్లపై వర్షపునీరు నిలవకుండా చూడాలని... ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత పడాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు.

Read more Photos on
click me!

Recommended Stories