వైఎస్ వివేకా హత్య కేసు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ మరింత వేగం పెంచింది. సోమవారంనాడు కడప ఎస్పీగా పనిచేసిన రాహుల్ దేవ్ శర్మను సీబీఐ విచారించింది. రెండు గంటల పాటు సీబీఐ అధికారులు రాహుల్ దేవ్ శర్మ నుండి వివరాలు సేకరించారు.
వైఎస్ వివేకా హత్య కేసు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారించిన సిట్ లో రాహుల్ దేవ్ శర్మ సభ్యుడిగా ఉన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన వివరాలను సీబీఐ అడిగి తెలుసుకుంది. హత్య జరిగిన సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి ఇంట్లో దొరికిన ఆధారాలపై సీబీఐ ఆరా తీసింది. రెండు గంటల పాటు వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి సీబీఐ అధికారులు రాహుల్ దేవ్ శర్మ నుండి వివరాలు సేకరించారు.
వైఎస్ వివేకా హత్య కేసు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును అన్ని కోణాల్లో సీబీఐ విచారిస్తుంది. కడప ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి వైఎస్ వివేకానందరరెడ్డి హత్యలో ఆస్తి వివాదాలు కారణమనే ఆరోపించారు. వివేకానందరెడ్డి ముస్లిం మహిళను రెండో వివాహం చేసుకున్నారని చెప్పారు. వీరికి ఓ కొడుకు పుట్టాడని అవినాష్ రెడ్డి చెప్పారు. ఆస్తి విషయమై మొదటి భార్యకు రెండో భార్యకు మధ్య గొడవలున్నాయన్నారు.
వైఎస్ వివేకా హత్య కేసు
ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం వైఎస్ సునీతా రెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డిని కూడా సీబఐ అధికారులు ప్రశ్నించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపణలు, వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్యగా చెబుతున్న మహిళ చేసిన ఆరోపణలపై సీబీఐ ప్రశ్నించినట్టుగా సమాచారం.
వైఎస్ వివేకా హత్య కేసు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఈ ఏడాది జూన్ 30వ తేదీ లోపుగా విచారించాలని సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై రేపు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.
వైఎస్ వివేకా హత్య కేసు
2019 మార్చి 14వ తేదీ రాత్రి వైఎస్ వివేకానందరెడ్డిని దుండగులు హత్య చేశారు. ఈ హత్య కేసును సీబీఐ విచారిస్తుంది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ విచారిస్తుంది.