ఈ ఏడాది మెగా డీఎస్సీ: నిరుద్యోగులకు బొత్స గుడ్ న్యూస్

First Published | Apr 21, 2023, 2:31 PM IST

రాష్ట్రంలో  పలు అంశాలపై  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ  స్పందించారు.  త్వరలో ఏపీ లో డీఎస్పీని నిర్వహిస్తామన్నారు.  

బొత్స సత్యనారాయణ

రాష్ట్రంలో ఈ ఏడాది  మెగా డీఎస్సీ ద్వారా  ఉపాధాయ పోస్టులను భర్తీ చేస్తామని  ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ  చెప్పారు.శుక్రవారంనాడు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ  మీడియా ప్రతినిధులతో  చిట్  చాట్  చేశారు. టీచర్ల బదిలీలపై ప్రత్యేకంగా  దృష్టి  సారించినట్టుగా  చెప్పారు.

బొత్స సత్యనారాయణ

కర్ణాటక తరహలో  ప్రతి ఏటా టీచర్ల బదిలీలు చేపట్టనున్నట్టుగా  మంత్రి తెలిపారు. టీచర్ల బదిలీల  కోసం ప్రత్యేక చట్టం తీసుకు రావాలని  యోచిస్తున్నట్టుగా  మంత్రి  వివరించారు.  కాంట్రాక్టు లెక్చరర్లను చట్టబద్దంగా  క్రబద్దీకరిస్తామన్నారు.  పాఠశాల విద్యాశాఖలో  10 వేల ఖాళీలున్నట్టుగా  గుర్తించామన్నారు మంత్రి,  

Latest Videos


బొత్స సత్యనారాయణ

విశాఖ పట్టణం పరిపాలన రాజధాని అని  మంత్రి బొత్స సత్యనారాయణ  చెప్పారు. అదే తమ విధానమని  ఆయన గుర్తు  చేశారు.  విశాఖ స్టీల్ ప్లాంట్  బిడ్డింగ్ తో  అందరి   వ్యవహరం బయటపడిందని  మంత్రి బొత్స సత్యనారాయణ  పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వంపై  వ్యాఖ్యలు  చేశారు.  తొలి నుండి  విశాఖ స్టీల్ ప్లాంట్  విషయంలో తాము  ఒకే విషయాన్ని చెబుతున్నామన్నారు.  స్టీల్ ప్లాంట్ కేంద్రం ఆధీనంలో ఉండాలనేది తమ విధానమని  బొత్స చెప్పారు.

బొత్స సత్యనారాయణ


గత ఏడాదిలో  కూడ ఏపీ ప్రభుత్వం డీఎస్పీని నిర్వహించింది.  502 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు  ఏపీ ప్రభుత్వం  గత ఏడాది డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

బొత్స సత్యనారాయణ


మూడు రాజధానుల విషయంలో మార్పు లేదన్నారు.  రాష్ట్రాన్ని అభివృద్ది  చేయాలనే ఉద్దేశ్యంతో  తమ ప్రభుత్వం మూడు రాజధానులను  తెరమీదికి తెచ్చిందని  మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.  ఎవరి కోసమో  ఈనిర్ణయాన్ని మార్చుకోబోమన్నారు. 

click me!