ప్రేమ పేరుతో ఏలూరులో పైశాచికం:ఇంజనీరింగ్ స్టూడెంట్‌పై వేడి నూనె పోసి చిత్రహింసలు

First Published | Apr 23, 2023, 2:11 PM IST


ప్రేమ పేరుతో  ఇంజనీరింగ్  విద్యార్ధినిని  చిత్రహింసలకు గురి  చేశాడు  అనుదీప్ అనే యువకుడు. బాధితురాలి  ఫిర్యాదు మేరకు  ఏలూరు పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు.  

ప్రేమ సేరుతో వేధింపులు

ప్రేమ పేరుతో  ఇంజనీరింగ్  విద్యార్ధినిని చిత్రహింసలుకు గురిచేశాడు  అనుదీప్ అనే యువకుడు.  బాధితురాలు తీవ్ర గాయాలతో  ఆసుపత్రిలో  చికిత్స  పొందుతుంది.   నిందితుడిని  కఠినంగా  శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు  కోరుతున్నారు. 
 

ప్రేమ సేరుతో వేధింపులు

ఏలూరు పట్టణానికి  చెందిన  యువతి  ఇంజనీరింగ్ మూడో సంవత్సరం  చదువుతుంది. ఏలూరుకు  చెందిన  దుగ్గిరాలకు  చెందిన  అనుదీప్  యువతిని  ప్రేమలోకి దించాడు.  యువతిని పెళ్లి  చేసుకుంటానని  నమ్మించాడు. 


ప్రేమ సేరుతో వేధింపులు

మూడు  రోజుల క్రితం  యువతిని  అనుదీప్   తన ఇంటికి తీసుకెళ్లాడు. యువతిని  గదిలో బంధించి  చిత్రహింసలకు గురి చేశాడు.  యువతిపై  వేడి నూనె పోశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.  అంతేకాదు  నిన్న రాత్రి  ఆమెకు ఉరేసి చంపేందుకు  నిందితుడు  ప్రయత్నించాడు. అయితే  ఈ సమయంలో  బాధితురాలు తప్పించుకొని  తండ్రికి ఫోన్  చేసింది.   వెంటనే   బాధితురాలి తండ్రి సంఘటనస్థలానికి  చేరుకున్నారు. 

ప్రేమ సేరుతో వేధింపులు

 అయితే   నిందితుడు  అనుదీప్  పారిపోయాడు. తీవ్ర గాయాలతో  ఉన్న కూతురిని  ఆసుపత్రిలో  చేర్పించాడు  తండ్రి.. తన కూతురిని  చిత్రహింసలకు గురి చేసిన  నిందితుడిని  కఠినంగా శిక్షించాలని ఆయన  డిమాండ్  చేశారు. 
 

ప్రేమ సేరుతో వేధింపులు

  గతంలో కూడా   నందితుడు  యువతులను  ట్రాప్  చేసి చిత్రహింసలకు గురి చేశాడని  బాధితురాలి తండ్రి ఆరోపించారు.   బాధితురాలి  కుటుంబ సభ్యులు  ఈ విషయమై  పోలీసులకు  పిర్యాదు  చేశారు.  ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు  కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు. 

ప్రేమ పేరుతో యువతనుల వేధిస్తున్న ఘటనలు దేశంలోని  పలు  రాష్ట్రాల్లో  చోటు  చేసుకుంటున్నాయి.  
 

Latest Videos

click me!