YS Rajareddy- Atluri Priya: వైవాహిక బంధంతో ఒక్కటైన వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియ.. పెళ్లి ఫొటోలు వైరల్..

First Published | Feb 17, 2024, 11:21 PM IST

YS Sharmila: ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తనయుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహం జోథ్ పూర్ లో నేడు జరిగింది ఈ నేపథ్యంలో  షర్మిల తన కుమారుడి హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

YS Sharmila’s Son Raja Reddy’s Wedding – Haldi Event

YS Rajareddy- Atluri Priya: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తనయుడు రాజా రెడ్డి వివాహం నేడు (ఫిబ్రవరి 17న) జరిగింది. అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ప్రియా అట్లూరితో రాజా రెడ్డి పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. వీరి వివాహానికి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఉమేద్ ప్యాలెస్‌ వేదిక అయ్యింది. కుటుంబ సభ్యులు,స్నేహితులు మధ్య వీరి వివాహం జరిగింది. 

YS Sharmila’s Son Raja Reddy’s Wedding – Haldi Event

YS Rajareddy- Atluri Priya: ఈ నేపథ్యంలో షర్మిల తన కుమారుడి రాజారెడ్డి- ప్రియా అట్లూరి హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.  కంగ్రాచ్యులేషన్స్ రాజా-ప్రియా అంటూ ట్వీట్ చేశారు. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అంటూ దీవించారు.


YS Sharmila’s Son Raja Reddy’s Wedding – Haldi Event

YS Rajareddy- Atluri Priya:ఈ హాల్దీ వేడుకల్లో షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల కుమార్తె అంజలి రెడ్డి, వైఎస్ విజయమ్మ, ప్రియా అట్లూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దంపతులు తెల్లటి సంప్రదాయ దుస్తులు ధరించగా, షర్మిల, విజయమ్మతో సహా మిగిలిన కుటుంబ సభ్యులు పసుపు ధరించి హల్దీ కార్యక్రమానికి హాజరయ్యారు.

YS Sharmila’s Son Raja Reddy’s Wedding – Haldi Event

YS Rajareddy- Atluri Priya: ఇక రాజారెడ్డి, ప్రియా అట్లూరి నిశ్చితార్థం జనవరి 18న హైదరాబాదులోని గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగింది. కాగా, వీరి వివాహ వేడుకలు రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో ఈ నెల 16 నుంచి 18 వరకు ఘనంగా నిర్వహించనున్నారు. నేడు వివాహం జరగగా రేపు విందు ఏర్పాటు చేశారు.

Latest Videos

click me!