ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ
నీటిపారుదల ప్రాజెక్టుల అంశంపై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చను వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కోసం జగన్ ఏం చేశాడో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డే అసెంబ్లీ సాక్షిగా చెప్పాడని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు చేశారు.
ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ
తెలంగాణ అసెంబ్లీలో ఈ నెల 12న కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దని తీర్మానం చేశారు. ఈ తీర్మానంపై చర్చ జరిగింది.ఈ చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది.
ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ
శ్రీశైలం ప్రాజెక్టు నుండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను 92, 500 క్యూసెక్కులు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ సర్కార్ సానుకూలంగా వ్యవహరించిందని కాంగ్రెస్ ఆరోపించింది.
ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ
1983లో పోతిరెడ్డి పాడు ద్వారా 11,150 క్యూసెక్కులను ప్రతి రోజూ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. అయితే 2005 లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 11, 500 క్యూసెక్కుల నీటిని 44 వేల క్యూసెక్కులు తీసుకెళ్లేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది
ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రోజూ 92,500 క్యూసెక్కుల పెంచిన విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేసింది. అయినా కేసీఆర్ సర్కార్ దీన్ని ఆపలేదన్నారు.2004 నుండి 2014 వరకు 727 టీఎంసీలు తీసుకుంటే... 2014 నుండి 2024 వరకు 1,201 టీఎంసీలను ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లిన విషయాన్ని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ
తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ఏపీ అసెంబ్లీలో వై.ఎస్. జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు చూపారు.
ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నీటి విషయంలో రాష్ట్రానికి ఏం చేశారనే విషయాన్ని తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చను చూస్తే అర్ధమౌతుందని అధికార పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో ప్రజల గురించి చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి జగన్ మేలు గురించి తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగిన విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తు చేశారు.
ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ: వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ ఇదీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్దమౌతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ అసెంబ్లీ చర్చను తమకు అనుకూలంగా వైఎస్ఆర్‌సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారానికి ఉపయోగించుకొనే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.