టిక్కెట్లకు ఎసరు:పొత్తులపై తెలుగు తమ్ముల్లో గుబులు, బాబు హమీ ఇదీ..

First Published | Feb 17, 2024, 9:53 AM IST

పొత్తులు తెలుగు దేశం పార్టీ నేతలకు ఎసరు తెచ్చిపెడుతున్నాయి.  ఎవరి సీటు  త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చిందోననే విషయమై నేతల్లో ఆందోళన నెలకొంది.

టిక్కెట్లకు ఎసరు:పొత్తులపై తెలుగు తమ్ముల్లో గుబులు, బాబు హమీ ఇదీ..

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి రానున్న రెండు మూడు మాసాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో  రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు  ఎన్నికలకు సన్నద్దమౌతున్నాయి. 

టిక్కెట్లకు ఎసరు:పొత్తులపై తెలుగు తమ్ముల్లో గుబులు, బాబు హమీ ఇదీ..

తెలుగుదేశం, జనసేనలు కూటమిగా ఏర్పడ్డాయి.ఈ కూటమిలో  బీజేపీ కూడ చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాతో  తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు  ఇటీవల చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పొత్తులపై  త్వరలోనే స్పష్టత రానుందని  కేంద్ర మంత్రి అమిత్ షా కూడ  స్పష్టం చేశారు. ఎన్‌డీఏలోకి తెలుగు దేశం పార్టీ చేరిక విషయమై  వచ్చే వారంలో స్పష్టత రానుంది. 

టిక్కెట్లకు ఎసరు:పొత్తులపై తెలుగు తమ్ముల్లో గుబులు, బాబు హమీ ఇదీ..

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  శుక్రవారంనాడు  పార్టీ నేతలతో  టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.  పొత్తుల నేపథ్యంలో  త్యాగాలు చేయాల్సిన అవసరాన్ని  పార్టీ నేతలకు చెప్పారు. మరో వైపు  వైఎస్ఆర్‌సీపీలో  అసంతృప్తులు  తెలుగు దేశంలో చేరే విషయాన్ని కూడ  చంద్రబాబు  సూచన ప్రాయంగా వెల్లడించారు. ఇతర పార్టీల నుండి  తెలుగు దేశంలో పార్టీలో చేరేందుకు వచ్చేవారితో కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. 

టిక్కెట్లకు ఎసరు:పొత్తులపై తెలుగు తమ్ముల్లో గుబులు, బాబు హమీ ఇదీ..

అయితే  ఎవరెవరిని  పార్టీలో చేర్చుకుంటున్నారనే విషయమై  చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. పొత్తులు, ఇతర పార్టీల నుండి  తెలుగు దేశం పార్టీలో చేరే వారితో  ఇప్పటివరకు  పార్టీనే నమ్ముకున్న నేతల  సీట్లకు ఎసరు వచ్చే పరిస్థితి నెలకొంది. ఈ ఎన్నికల్లో  గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని  చంద్రబాబు భావిస్తున్నారు.  ఆయా అసెంబ్లీ, పార్లమెంట్ నియోకవర్గాల్లో గెలుపు అవకాశాలున్న అభ్యర్ధుల ఎంపిక కోసం చంద్రబాబునాయుడు  సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ఆధారంగా  అభ్యర్థులను చంద్రబాబు ఎంపిక చేయనున్నారు.

టిక్కెట్లకు ఎసరు:పొత్తులపై తెలుగు తమ్ముల్లో గుబులు, బాబు హమీ ఇదీ..

ఈ ఎన్నికల్లో సీట్లు త్యాగాలు చేసేవారికి  రాష్ట్రంలో అధికారంలోకి రాగానే  తొలి ప్రాధాన్యత ఇస్తామని  చంద్రబాబు హామీ ఇచ్చారు.  నామినేటేడ్ పదవుల్లో  సీట్లు త్యాగం చేసిన వారికే ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు వ్యాఖ్యలతో  పార్టీ నేతల్లో గుబులు మొదలైంది.  ఎవరి సీట్లు గల్లంతు అవుతాయనే ఆందోళన నెలకొంది.  

టిక్కెట్లకు ఎసరు:పొత్తులపై తెలుగు తమ్ముల్లో గుబులు, బాబు హమీ ఇదీ..

జనసేన, బీజేపీలకు కనీసం  ముప్పైకి పైగా అసెంబ్లీ సీట్లు కేటాయించాల్సిన అనివార్య పరిస్థితులు  తెలుగు దేశం పార్టీకి నెలకొంది.  మరో వైపు కనీసం  ఏడెనిమిది  ఎంపీ స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాల్సిన పరిస్థితి  లేకపోలేదు

టిక్కెట్లకు ఎసరు:పొత్తులపై తెలుగు తమ్ముల్లో గుబులు, బాబు హమీ ఇదీ..

సీట్ల షేరింగ్ విషయమై  ఈ పార్టీల మధ్య  పొత్తు చర్చలపై వచ్చే వారంలో స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు.   పొత్తుల కారణంగా  తెలుగు దేశం పార్టీ నేతలకు టిక్కెట్లు దక్కని పరిస్థితి లేకపోలేదు. అయితే  సీట్లు దక్కని తెలుగు దేశం పార్టీ నేతలు ఎలా వ్యవహరిస్తారనే విషయం రానున్న రోజుల్లో  స్పష్టత రానుంది.

Latest Videos

click me!