Sharmila - Kavitha: శనివారం జరిగిన బీసీ బంద్‌లో కవిత.. అటు ఏపీలో కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కర్నూలు ఉల్లి రైతులకు మద్దతుగా తెలిపిన నిరసనలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక ఈ తల్లులకు అండగా కొడుకులు నిలిచారు.
అటు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, ఇటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రస్తుతం రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇద్దరిలోనూ కొన్ని పోలికలు కలుస్తున్నాయి. తమ అన్నలు వైఎస్ జగన్, కేటీఆర్‌తో పేచీలు.. సొంత పార్టీల నుంచి బహిష్కరణలు ఎదుర్కున్నవారే.
25
ఒంటరిగానే పోరాటం కొనసాగిస్తూ..
ఈ ఇద్దరు కూడా సొంతంగానే రాజకీయంగా ముందుకు దూసుకెళ్తున్నారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరి.. ప్రజలకు అండగా నిలుస్తుంటే.. మరోవైపు కవిత.. తెలంగాణ జాగృతి పార్టీ నేతృత్వంలో రాజకీయ యాత్రకు సిద్దం అయింది. ఇక ఇప్పుడు వారిద్దరి వారసుల రాజకీయ ప్రవేశం తెరపైకి వచ్చింది.
35
అమ్మలకు అండగా..
ఇటీవల కర్నూలు ఉల్లి మార్కెట్‌లో తల్లి వైఎస్ షర్మిలకు తోడుగా ఆమె కుమారుడు రాజారెడ్డి సందడి చేశాడు. అలాగే శనివారం జరిగిన బీసీ బంద్‌లో కవితతో ఆమె కుమారుడు ఆదిత్య కనిపించడం రాజకీయాల్లో పెద్ద సర్‌ప్రైజ్ అని చెప్పొచ్చు.
ఇలా ఒకే రోజు రెండు వివిధ పొలిటికల్ అంశాల్లో కవిత, వైఎస్ షర్మిల కొడుకులు తళుక్కుమన్నారు. ఇక ఇప్పుడిదే పెద్ద చర్చకు దారి తీసింది. రెండు రాష్ట్రాల్లోనూ తమ రాజకీయ పోరాటాలను కొనసాగిస్తూనే.. తమ వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం కవిత, షర్మిల బాటలు వేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.
55
పురుషుల ఆధిపత్యమే ఎక్కువ..
సాధారణంగా మనం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను పరిశీలిస్తే.. రాజకీయాల్లో రెండింట పురుషులు ఆధిపత్యమే ఎక్కువ కనిపిస్తుంది. ఈ తరుణంలో చిన్న వయసులోనే తమ కుమారులను రాజకీయాల్లోకి ప్రవేశపెట్టడంలో కవిత, షర్మిల ఒకేలా ఆలోచిస్తున్నారని.. ఇలా చేయడం వల్ల వారికి ప్రయోజనం చేకూరుతుందని అనుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.