YSRCP : వైసిపి ఎమ్మెల్యేలు చచ్చినా రాజీనామా చేయరు... ఎందుకో తెలుసా?

Published : Sep 24, 2025, 10:09 PM IST

YSRCP : అసెంబ్లీ నుండి సస్పెండ్ అయితే కావచ్చుగానీ… జగన్ తో సహా వైసిపి ఎమ్మెల్యేలు వాళ్లంతట వాళ్లు రాజీనామాలు చేసే అవకాశాలు చాలా తక్కువ… ఎందుకో తెలుసా? 

PREV
15
వైఎస్ జగన్ పై అనర్హత వేటు?

YSR Congress Party : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే అధికార కూటమి మాత్రం అందుకు ససేమిరా అంటోంది... ప్రజలే వైసిపిని ప్రతిపక్షంగా ఉండేందుకు అనుమతించలేదు, మేమెందుకు ఇస్తామంటోంది. ఇక ప్రతిపక్ష హోదా విషయాన్ని మరిచిపోతే మంచిదని టిడిపి నాయకులు అంటున్నారు.  చివరకు పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే వైఎస్ జగన్ తో పాటు ఇతర వైసిపి ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదా ఇచ్చేవరకు అసెంబ్లీకి హాజరుకామంటే... ఇలాగైతే సస్పెండ్ చేయాల్సి వస్తుందని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు హెచ్చరిస్తున్నారు.

భారత రాజ్యాంగం 190(4) ప్రకారం ఎవరైనా అసెంబ్లీ లేదా పార్లమెంట్ కు ఎలాంటి అనుమతి లేకుండా వరుసగా 60 రోజులు గైర్హాజరయితే వారి సభ్యత్వం రద్దుచేయవచ్చని డిప్యూటీ స్పీకర్ రూల్స్ గుర్తుచేస్తున్నారు. దీంతో నిజంగానే వైఎస్ జగన్ ను సస్పెండ్ చేస్తారా? ఆయనతో పాటు మిగతా పదిమందిపై అనర్హత వేటు వేస్తారా? డిప్యూటీ స్పీకర్ రఘురామ మాటల్లోని ఆంతర్యం ఇదేనా? అన్న చర్చ ప్రజల్లో సాగుతోంది.

25
వైఎస్ జగన్ ఏం చేస్తారు?

అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చేంతవరకు అసెంబ్లీకి వచ్చేదిలేదని వైఎస్ జగన్ శపథం చేశారు... కాబట్టి పరిస్ధితులు ఎలా ఉన్నా ఆయన వెళ్లలేడు. కానీ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లకుంటే అనర్హత వేటు పడేలా ఉంది. దీంతో వైఎస్ జగన్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారయ్యింది. అయితే అనర్హత వేటు పడేకంటే ముందే తన ఎమ్మెల్యేలందరితో కలిసి రాజీనామా చేసే ఆలోచనలో ఆయన ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే జగన్ కు మరింత ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

35
జగన్ తో పాటు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే జరిగేది ఇదేనా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా వైసిపి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినా... అంతకంటే ముందుగానే వాళ్ళు రాజీనామా చేసినా ఉపఎన్నికలు రావడం ఖాయం. ఇప్పటికే 151 సీట్ల నుండి 11 కు పడిపోయిన జగన్ బలాన్ని మరింత తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది... కాబట్టి ఉపఎన్నికలకు సిద్దమవుతుంది. ఇందులో వైసిపి ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతుంది. ఇది మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఉంటుంది... అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షం కోసం రాజీనామా చేస్తే ఉన్నసీట్లు ఊడిపోయే పరిస్థితి వైసిపికి వస్తుంది. ఈ విషయం జగన్ కు కూడా తెలుసు... అందుకే పొరపాటున కూడా రాజీనామా ఆలోచన చేయరని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఇటీవల వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇలా జగన్ ఇలాకాలో సత్తాచాటి చివరకు విజయం సాధించింది టిడిపి. అలాంటిది జగన్ రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళితే... జడ్పిసిటి ఎన్నికల్లో కంటే గట్టిగా గెలుపు కోసం ప్రయత్నించడం ఖాయం. గెలుపోటములు ఎలా ఉన్నా అధికారం టిడిపి చేతిలో ఉంది కాబట్టి వైఎస్ జగన్ కు ముప్పుతిప్పలు పెట్టవచ్చు.

వైఎస్ జగన్ పరిస్థితే ఇలా ఉంటే మిగతా వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళితే పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇలా వైసిపి ఎమ్మెల్యేలు ఒకరిద్దరు ఓడినా వైసిపి బలం సింగిల్ డిజిట్ కు పడిపోతుంది... ఇది ఆ పార్టీకి మరింత అవమానం. అదే టిడిపి ఓటమిపాలైనా ఆ సీట్లు ఎలాగూ వారివి కావు కాబట్టి లైట్ తీసుకుంటారు. ఎలా చూసినా రాజీనామాలు చేయడం వైసిపికే దెబ్బ... కాబట్టి అంత సాహసం చేయకపోవచ్చు.

45
ప్రతిపక్ష హోదా ఇవ్వకున్న ప్రజాపోరాటానికి వైసిపి సై...

అధికార కూటమి అసెంబ్లీలో నియంతలా వ్యవహరించేందుకు తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడంలేదని వైసిపి నాయకులు అంటున్నారు. అసలు ప్రశ్నించేవారే లేకుంటే అసెంబ్లీ నడిపి ఏం లాభం... వాళ్లను వాళ్ళు పొగుడుకోడానికేనా సమావేశాలు నిర్వహించేది? ప్రజల పక్షాన ప్రశ్నించేది ఎవరు? ప్రజా సమస్యలను అధికార పార్టీ దృష్టికి తెచ్చేది ఎవరు? అని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.

అయితే అసెంబ్లీలో ప్రజలపక్షాన మాట్లాడే అవకాశం ఇవ్వకున్న బయటమాత్రం తాము నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని వైసిపి అధినేత వైఎస్ జగన్ అంటున్నారు. అందుకోసమే ఇప్పటికే రైతుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగేలా చూస్తున్నానని... అలాగే ప్రభుత్వ తీరుతో ఇబ్బందులపాలయిన వారిని పరామర్శిస్తున్నానని అంటున్నారు. ఇక దసరా తర్వాత తన ప్రజా పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తానని... మెడికల్ కాలేజీలను పిపిపి విధానంలో పూర్తిచేయాలన్న చంద్రబాబు సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళతానని జగన్ ప్రకటించారు.

55
వైసిపి నాయకుల కోసం కొత్త యాప్ లాంచ్

ప్రజల్లోకే కాదు సొంత పార్టీ నాయకుల మధ్యకు వెళ్లేందుకు వైఎస్ జగన్ సిద్దమయ్యారు. ఇందులో భాగంగా ఇప్పటికే కీలక నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన త్వరలోనే ఇతర నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యేందుకు సిద్దమయ్యారు. అంతకంటే ముందు వైసిపి నాయకులకు ధైర్యం ఇచ్చేందుకు తాజాగా వైసిపి డిజిటల్ బుక్ యాప్ ను లాంచ్ చేసింది... స్వయంగా వైఎస్ జగన్ దీన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, అన్యాయానికి గురయినా వైసిపి నాయకులు ఆ యాప్ లో నమోదు చేయవచ్చు. ఇలా గతంలో నారా లోకేష్ రెడ్ బుక్ మాదిరిగానే వైసిపి డిజిటల్ బుక్ తో నాయకుల్లోకి వెళుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories