ఇంతకూ విజయసాయి రెడ్డి ఏమన్నారంటే :
తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసిపి రాజ్యసభ సభ్యులు పార్టీ మారడంపై మాట్లాడుతూ విజయసాయి రెడ్డి ప్రస్తావన తెచ్చారు. మొత్తం 11 మంది ఎంపీల్లో విజయసాయి రెడ్డితో కలిసి నలుగురు వెళ్ళిపోయారని అన్నారు. ఇలా వెళ్లిపోయేవారికి ఒకటే చెబుతున్నా... రాజకీయాల్లో క్యారెక్టర్, విశ్వసనీయత చాలా ముఖ్యమని అన్నారు.
పలానావాడు తమ నాయకుడని కాలర్ ఎగరేసి చెప్పేలా వుండాలని జగన్ పేర్కొన్నారు. కానీ ప్రలోబాలకు లొంగి లేదంటే భయపడి క్యారెక్టర్ ను ఫణంగా పెట్టకూడదని అన్నారు. ఇలాచేస్తే మనపై గౌరవం పోతుందన్నారు. రాజకీయాల్లో రోజులు ఒకేలా వుండవు... కష్టం అనేది ఎక్కువకాలం వుండదన్నారు. ఐదేళ్లు ఓపిక పడితే అయిపోయేదని పార్టీవీడిన ఎంపీలను ఉద్దేశించి జగన్ కామెంట్ చేసారు.
వైఎస్ జగన్ కామెంట్స్ విజయసాయి రెడ్డికి గట్టిగా తాకినట్లున్నాయి. అందుకే ఆయన జగన్ తో ఇంతకాలంగా ఉన్న సాన్నిహిత్యాన్ని కూడా మరిచి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఎక్స్ వేదికన స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేసారు.
''వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా'' అంటూ విజయసాయి రెడ్డి రియాక్ట్ అయ్యారు.